Posted on 2025-11-21 19:30:24
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: షాబాద్ మండలం ఆస్పల్లిగూడ గ్రామంలో చిలకల సువర్ణ ఇందిరమ్మ ఇళ్లు ప్రారంభోత్సవంలో జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మెన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ క్రమంలో ఆయన ఇందిరమ్మ ఇల్లు లబ్దిదారురాలు చిలకల సువర్ణను అభినందిస్తూ సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వంలో ఇందిరమ్మ ఇండ్లు వాస్తవ రూపం దాలుస్తున్నాయన్నారు. పేద ప్రజల సొంతింటి కల ప్రజా ప్రభుత్వంలో సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో సాధ్యమైందని అన్నారు. నిరుపేద ప్రజలు ఆత్మగౌరవంతో జీవించే విధంగా ప్రభుత్వం అందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తున్నదని చెప్పారు.మన జిల్లాలో అర్హులైన ప్రతీ ఒక్కరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇప్పిస్తానని ఆయన తెలిపారు.ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో కృషి చేస్తున్న ప్రభుత్వ అధికారులు, గ్రామ పంచాయతీ కార్యదర్శులు, హౌసింగ్ శాఖ అధికారులు అందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గుడిమల్కాపూర్ మార్కెట్ వైస్ చైర్మన్ కావలి చంద్రశేఖర్, మాజీ ఎంపీటీసీ కుమ్మరి చెన్నయ్య, గుండాల అశోక్, మాజీ సర్పంచులు ప్రతాప్ రెడ్డి, మహేందర్ గౌడ్, శ్రీనివాస్ గౌడ్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు దండు రాహుల్ గుప్త, గంధం గౌరిశ్వర్,ప్రభాకర్ రెడ్డి, ఆంజనేయులు, రవీందర్ రెడ్డి, శ్రీనివాస్,కృష్ణారెడ్డి, మహేష్, రమేష్, సూర్య,పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు...
పెద్ద కంజర గ్రామ ప్రజలకు ఇడ్ల స్థలాలు కేటాయించాలని ఇంద్రేశం మున్సిపల్ కమిషనర్ కి మెమోరాండం అందజేత
Posted On 2025-11-21 21:07:39
Readmore >
ఇందిరమ్మ ఇల్లు ప్రారంభించిన గ్రంథాలయ ఛైర్మెన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి
Posted On 2025-11-21 19:30:24
Readmore >
ఫార్మలా -ఈ కార్ రేసు లో కాంగ్రెస్, భాజపా కుట్రలో భాగమే గవర్నర్ అనుమతి
Posted On 2025-11-21 19:28:07
Readmore >
పార్కిన్సన్ వ్యాధిని తొలి దశలోనేవ్యాధిని చిన్న చిన్న శాస్త్ర చికిత్సల ద్వారా నయం చేయొచ్చు
Posted On 2025-11-21 13:41:10
Readmore >
డిజిటల్ సాంకేతికతతో ముప్పు.. పౌరులు తస్మాత్ జాగ్రత్త : కె.నరసింహ ఐపిఎస్, ఎస్పి సూర్యాపేట
Posted On 2025-11-21 12:50:28
Readmore >
ఎవరెస్ట్ అధిరోహకులు మాలవత్ పూర్ణ ను పరామర్శించిన మంత్రి సీతక్క
Posted On 2025-11-20 20:11:47
Readmore >