Posted on 2025-11-21 21:07:39
అన్యాక్రాంతం అవుతున్న భూములపైన సమగ్ర విచారణ జరిపిచాలి,
గ్రామస్తులకు ఇండ్ల స్థలాలు ఇవ్వాలని సిపిఎం పార్టీ బి నాగేశ్వరావు , అంబేద్కర్ సంఘాల జిల్లా అధ్యక్షులు దుర్గాప్రసాద్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. డైలీ భారత్ న్యూస్, పఠాన్ చేరు:పెద్ద కంజర్ల ఇండ్ల స్థలాల సాధన కమిటీ ఆధ్వర్యంలో ఇంద్రేశం మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించడం జరిగింది, అనంతరం కమిషనర్ కి మెమోరండం ఇవ్వడం జరిగింది.ఈ కార్యక్రమని ఉద్దేశించి సిపిఎం పార్టీ నాగేశ్వరరావు, జిల్లా అధ్యక్షులు దుర్గాప్రసాద్ , కాంగ్రెస్ పార్టీ నాయకులు వీర గల జంగయ్య, మాట్లాడుతూ పెద్ద కంజర్ల గ్రామంలో 120,121,125 సర్వే నెంబర్లలో గత 2022లో రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 240 ఎకరాల భూములను పరిశ్రమల ఏర్పాటు ట్రక్ టెర్మినల్స్ పేరుతో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం భూములను సేకరించిందని అన్నారు. జిల్లా అధికార యంత్రాంగం ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టినప్పుడు గ్రామస్తులకు ఇండ్ల స్థలాలు ఇస్తామని హామీని ఇచ్చారని, ఆ హామీని ప్రస్తుతం జిల్లా అధికారులు తుంగలో తొక్కారని అన్నారు.
పెద్ద కంజర్ల గ్రామంలో వందల ఎకరాల ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమవుతున్న జిల్లా రెవెన్యూ యంత్రాంగం చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నదని అన్నారు. అరబిందో తత్వ, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు, ఫామ్ హౌస్ యాజమాన్యాలు చెరువు శిఖం భూములను ఆక్రమించి యదేచ్ఛగా వ్యాపారం చేసుకుంటున్నారు . లక్షల గజాల రూపంలో సర్వేనెంబర్ 121 లో ప్రభుత్వ భూమి ఏ విధంగా రిజిస్ట్రేషన్ అవుతుందని అధికారులను ప్రశ్నించారు .
పేదవాళ్లు ఇడ్ల స్థలాల కోసం ఒక గజం స్థలాన్ని ఆక్రమించుకుంటే ప్రభుత్వ యంత్రాంగం చర్యలు తీసుకుంటుందని, 20, 30 ఎకరాలు అక్రమంగా ఆక్రమించుకొని రిజిస్ట్రేషన్ చేస్తున్న అధికారులను, ఏం చర్యలు తీసుకుంటున్నారని అన్నారు. రెవెన్యూ అధికారులు రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులతో చేతులు కలిపి పెద్దకంజర్ల గ్రామంలో అనేక అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారని పెద్ద కంజర్ల గ్రామ భూభాగోతం పైన సమగ్రమైన విచారణ జరిపించి, భూములను కాపాడాలని డిమాండ్ చేశారు.
పెద్దకంజర్ల గ్రామంలో కుటుంబాలకు ఇళ్ల స్థలాల గ్రామంలో ని ప్రజల కు అందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఆందోళనను మరింత తీవ్రతరం చేస్తామమని జిల్లా అధికార యంత్రం గాని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో , ముత్యాలు, నాగభూషణం, పెంటయ్య, ముఖ్య నాయకులు గ్రామ మహిళలు పెద్ద సంఖ్యలో ధర్నాలో పాల్గొన్నారు.
పెద్ద కంజర గ్రామ ప్రజలకు ఇడ్ల స్థలాలు కేటాయించాలని ఇంద్రేశం మున్సిపల్ కమిషనర్ కి మెమోరాండం అందజేత
Posted On 2025-11-21 21:07:39
Readmore >
ఇందిరమ్మ ఇల్లు ప్రారంభించిన గ్రంథాలయ ఛైర్మెన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి
Posted On 2025-11-21 19:30:24
Readmore >
ఫార్మలా -ఈ కార్ రేసు లో కాంగ్రెస్, భాజపా కుట్రలో భాగమే గవర్నర్ అనుమతి
Posted On 2025-11-21 19:28:07
Readmore >
పార్కిన్సన్ వ్యాధిని తొలి దశలోనేవ్యాధిని చిన్న చిన్న శాస్త్ర చికిత్సల ద్వారా నయం చేయొచ్చు
Posted On 2025-11-21 13:41:10
Readmore >
డిజిటల్ సాంకేతికతతో ముప్పు.. పౌరులు తస్మాత్ జాగ్రత్త : కె.నరసింహ ఐపిఎస్, ఎస్పి సూర్యాపేట
Posted On 2025-11-21 12:50:28
Readmore >
ఎవరెస్ట్ అధిరోహకులు మాలవత్ పూర్ణ ను పరామర్శించిన మంత్రి సీతక్క
Posted On 2025-11-20 20:11:47
Readmore >