Posted on 2025-11-18 07:01:34
డైలీ భారత్, హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో ఆదాయపన్ను శాఖ భారీ స్థాయిలో దాడులు చేపట్టింది. ప్రముఖ హోటల్ వ్యాపారులకు చెందిన చైర్మన్‌లు, డైరెక్టర్ల ఇండ్లతో పాటు మొత్తం 15 ప్రాంతాల్లో ఐటీ అధికారులు విస్తృతంగా శోధనలు జరుపుతున్నారు. నగరంలో కోట్ల రూపాయల టర్నోవర్‌తో పనిచేస్తున్న ప్రముఖ హోటల్ చైన్‌లు పిస్తా హౌస్, షాహ్ ఘౌస్ సహా మరికొన్ని పెద్ద వ్యాపార సంస్థలు ఈ సోదాల పరిధిలోకి వచ్చాయి. ప్రతి సంవత్సరం వందల కోట్ల విలువైన వ్యాపారం జరిగే ఈ సంస్థల ఖాతాలకు సంబంధించిన పత్రాలను అధికారులు పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఇదిలావుంటే, షాహ్ ఘౌస్ యజమానుల సహోదరుల ఇళ్లపై కూడా దాడులు కొనసాగుతున్నాయి. ఇవి యాఖుత్‌పుర ప్రాంతంలోని రైన్ బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఐటీ దాడులపై మరిన్ని వివరాలు త్వరలో వెలువడనున్నాయి.
కామారెడ్డి : కళ్యాణలక్ష్మి పథకంలో భారీ మోసం బట్టబయలు... ముగ్గురి అరెస్ట్
Posted On 2026-07-28 17:42:20
Readmore >
డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో 71 మందికి కోర్టు శిక్షలు – ₹81,500 జరిమానా విధింపు
Posted On 2026-07-28 17:30:20
Readmore >
మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డిని కలిసిన కాంగ్రెస్ రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి మొహమ్మద్ ఇబ్రహీం
Posted On 2026-07-28 17:21:37
Readmore >
భద్రాద్రి జిల్లాలో సైబర్ మోసం... రూ.3.20 లక్షలు హోల్డ్ చేసిన పోలీసులు
Posted On 2026-07-28 17:20:49
Readmore >
రాష్ట్ర అధ్యక్షులు బోట్ల కార్తీక్ ఆదేశాల మేరకు ఉప సర్పంచుల సమస్యలపై అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి. విక్టర్‌కు వినతి పత్రం
Posted On 2026-07-28 14:02:59
Readmore >
కోర్టు విచారణల వీడియోలు సోషల్ మీడియాలో వినియోగంపై సుప్రీంకోర్టు కఠిన ఆంక్షలు
Posted On 2026-07-28 14:01:16
Readmore >