Posted on 2025-11-15 15:17:35
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: కేసుల పరిష్కారానికి లోక్ అదాలత్ ఉత్తమ మార్గం అని రంగారెడ్డి జిల్లా ప్రధాన న్యాయమూర్తి,జిల్లా న్యాయసేవ అధికార సంస్థ చైర్మన్ కర్ణ కుమార్ అన్నారు.రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ వారి ఆదేశాల మేరకు రంగారెడ్డి జిల్లాలో గల అన్ని కోర్ట్ ప్రాంగణాలలో శనివారం స్పెషల్ లోక్ అదాలత్ నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ స్పెషల్ లోకాదాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ లోకదాలత్ లో సెటిల్ చేసుకోవడం ద్వారా తాము సివిల్ కేసులలో చెల్లించిన కోర్ట్ ఫీస్ కూడా తిరిగి పొందొచ్చు అని చెప్పారు. తమ కేసులను అనగా ఆస్తి పరమైన కేసులు మరియు కుటుంబ సమస్యల కేసులు పరిష్కారం చేసుకోవడానికి ఈ లోక్ అదాలత్ మరియు మధ్యవర్తిత్వం ఒక మంచి వేదిక అని చెప్పారు. లోక్ అదాలత్ లో కేసు రాజీ అవ్వడం ద్వారా ఇరు వర్గాలు గెలిచినట్టే అని అన్నారు.జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి హనుమంత రావు మాట్లాడుతూ రంగా రెడ్డి జిల్లా వ్యాప్తంగా అన్ని కోర్ట్ ప్రాంగణాలలో 20 లోక్ అదాలత్ బెంచిలు ఏర్పాటు చేశామని ఇందులో రాజీకి ఆమోద యోగ్యమైన క్రిమినల్ కేసులు ,సివిల్ దావాలు, చెక్ బౌన్స్ కేసులు, మోటారు వాహన ప్రమాద బీమా కేసులు, కన్జ్యూమర్ కోర్టు కేసులు, ప్రీ లిటిగేషన్ కేసులు పరిష్కరించుకొన్నారు అని చెప్పారు. ఈ లోక్ అదాలత్ నిర్వహించుటలో పోలీస్ వారు, ఇన్సూరెన్స్ అధికారులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, పానెల్ అడ్వొకేట్స్ మరియు జిల్లా న్యాయసేవాధికార సంస్థ సిబ్బంది తమవంతు సహాయసహకారాలను అందించారు కక్షిదారులు సంతోషం వ్యక్త పరిచారు.ఇందులో క్రిమినల్ కేసులు, సివిల్ కేసులు, మోటార్ వాహన ప్రమాదభీమా కేసులు, బ్యాంకు రికవరీ మరియు ప్రీలిటిగేషన్ కేసులు అన్ని కలిపి సుమారు 2050 పైచిలుకు కేసులు పరిష్కరించబడ్డాయి. అలాగే అన్ని కేసులలో కలిపి రూ.1,33,80,000/- రూపాయల వరకు నష్ట పరిహారాన్ని కక్షిదారులకు ఇప్పించడం జరిగింది.
ఇందిరమ్మ ఇండ్ల పేరుతో వసూళ్లు... కేటీఆర్ మౌనంపై బీజేవైఎం ఆగ్రహం
Posted On 2026-07-27 08:16:22
Readmore >
అధిరణ్ తొలి జన్మదిన వేడుకలకు హాజరై ఆశీర్వదించిన వెంకట సాయి నగర్ కాలనీ ప్రతినిధులు
Posted On 2026-07-27 07:39:23
Readmore >
ఉమ్మడి జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్న సమస్యల పరిష్కారంలో విఫలం
Posted On 2026-07-27 06:58:57
Readmore >
సదాశివనగర్‌లో కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం నిర్వహించిన ఎల్లారెడ్డి డీఎస్పీ ఎస్. శ్రీనివాస్ రావు
Posted On 2026-07-26 16:55:36
Readmore >
బీబీపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో పేకాట స్థావరంపై పోలీసుల దాడి – నలుగురిపై కేసు నమోదు
Posted On 2026-07-26 16:52:48
Readmore >