| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

అన్నారుపాడు గ్రామంలో ఘనంగా అయ్యప్పస్వామి మహా పడిపూజ కార్యక్రమం

అన్నారుపాడు గ్రామంలో ఘనంగా అయ్యప్పస్వామి మహా పడిపూజ కార్యక్రమం

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం అన్నారు పాడు గ్రామానికి చెందిన డాక్టర్ రమేష్ ఎంబిబిఎస్ ఎంఎస్ జనరల్ సర్జన్ వారి కుటుంబ సమేతంగా అన్నార్పాడు గ్రామంలో మహా పడిపూజ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఉమ్మడి జిల్లాల నలుమూలల నుంచి అయ్యప్ప స్వామిదీక్ష స్వాములు భారీగా తరలివచ్చారు రాత్రి 7 గంటలకు అయ్యప్ప స్వామి ప్రత్యేక అభిషేకాలు అనంతరం 18 మెట్లంబడి పడి వెలిగించిన అనంతరం భజన కార్యక్రమాలు అయ్యప్ప స్వాములకు గ్రామ భక్తులకు సద్ది కార్యక్రమాన్ని ఘనంగా ఏర్పాటు చేసినారు ఈ కార్యక్రమాన్ని అన్నారపాడు గ్రామంలో  ఏర్పాటు చేయటం చాలా సంతోషకరంగా ఉందని గ్రామస్తులు వారి కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు తెలియజేసుకున్నారు అంతేకాకుండా గ్రామంలో పాడిపంటలు సమృద్ధిగా పండాలని గ్రామం సుఖసంతోషాలతో వర్ధిల్లాలని గ్రామస్తులు అన్నారు ఈ కార్యక్రమంలో మాన్సింగ్, మాజీ సర్పంచ్ బానోతు పద్మ, టీచర్ హనుమ, రవి దంపతులు వారి కుటుంబ సభ్యులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

Previous కేసుల పరిష్కారానికి లోక్ అదాలత్ ఉత్తమ మార్గం : జిల్లా ప్రధాన న్యాయమూర్తి కర్ణ కుమార్
Next వైరా బోడేపూడి వైద్య శిబిరం విజయవంతం
ADVERTISEMENT