డైలీ భారత్, సిరిసిల్ల: స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బాలికల్లో ఈరోజు ఉపాధ్యాయ – తల్లిదండ్రుల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వరంగల్ RJD సత్యనారాయణ రెడ్డి హాజరయ్యారు.
ఈ సందర్భంగా తల్లిదండ్రులను ఉద్దేశించి విద్యార్థుల విద్యాభివృద్ధికి సంబంధించి పలు సూచనలు చేశారు. ప్రత్యేకించి 10వ తరగతి విద్యార్థుల స్టడీ హవర్స్, పరీక్షల సిద్ధత, హాజరు పరిరక్షణపై దృష్టి పెట్టాలని తల్లిదండ్రులకు సూచించారు.
తదుపరి పాఠశాల ప్రధానోపాధ్యాయులు శారద గారితో పాటు ఉపాధ్యాయులను కలిసి పాఠశాల విద్యా కార్యకలాపాలపై సమీక్ష నిర్వహించారు. పాఠశాల మధ్యాహ్న భోజనశాల మరియు పరిసర ప్రాంతాలను పరిశీలించారు.
ఇదే సందర్భంగా పాఠశాలలో నిర్వహిస్తున్న స్వయం పరిపాలన దినోత్సవం కార్యక్రమాన్ని పర్యవేక్షించి, విద్యార్థులు ఉపాధ్యాయులుగా పాత్రను పోషించడం పట్ల ఆయన అభినందనలు తెలిపారు.