| Daily భారత్
Logo




పి ఆర్ సి ని వెంటనే ప్రకటించి, అమలు చేయాలి!

News

Posted on 2025-11-13 18:30:40

Share: Share


పి ఆర్ సి ని వెంటనే ప్రకటించి, అమలు చేయాలి!

టీచర్ల పెండింగ్ బిల్లులను విడుదల చేయాలి!!

చకినాల అనిల్ కుమార్ టీపీటీఎఫ్ (TPTF) రాష్ట్ర అధ్యక్షులు డిమాండ్

 డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల:తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ రాజన్న సిరిసిల్ల జిల్లా లో  సిరిసిల్ల, వేములవాడ మండలంలో TPTF బాధ్యుల ఆధ్వర్యంలో మండలంలోని ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయ విద్యారంగ సమస్యలపై టీచర్లతో సమావేశాలను నిర్వహించడం జరిగింది.

ఈ సమావేశాలకు ముఖ్య అతిథిగా హాజరైన టిపిటిఎఫ్ (TPTF) రాష్ట్ర అధ్యక్షులు చకినాలు అనిల్ కుమార్ మాట్లాడుతూ గత పిఆర్సి గడువు ముగిసి రెండేళ్లు గడిచినప్పటికీ కొత్త కమిషన్ రిపోర్టును బహిర్గతపరిచి PRC ప్రకటించకపోవడం ఉద్యోగుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిదర్శనమని అన్నారు. ఉద్యోగులకు వెంటనే PRC ని ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయులకు హక్కుగా రావలసిన వివిధ రకాల ఆర్థిక బిల్లులను ప్రభుత్వం సంవత్సరాల తరబడి చెల్లించకుండా  ఇబ్బందులకు గురిచేస్తుందన్నారు. పెండింగ్లో ఉన్న టీచర్ల ఆర్థిక బిల్లులను మరియు డీఏలను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయులను తరగతిగది బోధనకు దూరం చేసే రకరకాల  శిక్షణలను మరియు  ఆన్‌లైన్‌ కార్యక్రమాలను విద్యాశాఖ రద్దు చేయాలని, పాఠశాలల్లో పర్యవేక్షణ కోసం డిప్యూటేషన్ పద్ధతిలో టీచర్లను నియమించకూడదని కోరారు. కేజీబీవీ టీచర్ల సమ్మె కాలపు వేతనాన్ని వెంటనే చెల్లించాలని,మాడల్ స్కూలు గురుకుల టీచర్లకు 010 పద్దు ద్వారా జీతాలు చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరారు .పెన్షనర్ల పెన్షనరీ ప్రయోజనాలను  వెంటనే విడుదల చేయాలని, హెల్త్ కార్డులను జారీ చేయాలని కోరారు.ఉపాధ్యాయ విద్యారంగ సమస్యల పరిష్కారానికి పోరాటాలే మార్గమని, ఉపాధ్యాయులు TPTF నిర్వహించబోయే ఉద్యమాలలో అధిక సంఖ్యలో పాల్గొని సమస్యల పరిష్కారానికి కదిలి రావాలని కోరారు.

ఈ సమావేశాలలో టీపిటిఎఫ్ జిల్లా అధ్యక్షులు దుమాల రమానాద్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి విక్కుర్తి అంజయ్య , జిల్లా ఉపాధ్యక్షులు పర్వతి తిరుపతి, వేములవాడ అర్బన్ అధ్యక్షులు బొజ్జ కృష్ణ, మహేష్, సిరిసిల్ల మండల అధ్యక్షులు జగిత్యాల శ్రీనివాస్, వేణు,  శ్రీనివాస్, పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు

Image 1

డ్రంక్ అండ్ డ్రైవ్ పై పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్న మారని మందుబాబులు

Posted On 2025-12-07 19:45:50

Readmore >
Image 1

చెప్పులు మెడలో వేసుకుని రాజీనామా చేస్తా : సర్పంచ్ అభ్యర్థిణి రాజేశ్వరి

Posted On 2025-12-07 18:39:01

Readmore >
Image 1

ఎస్ఎస్టీ చెక్ పోస్ట్ ను పరిశీలించిన ఇంచార్జి కలెక్టర్

Posted On 2025-12-07 18:35:52

Readmore >
Image 1

ఆయా దినపత్రికల స్టాపర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నిక

Posted On 2025-12-07 17:31:39

Readmore >
Image 1

పద్మశాలి విద్యార్థులు ఉన్నత విద్యలో ముందంజలో ఉండేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు

Posted On 2025-12-07 17:30:34

Readmore >
Image 1

కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి తెలంగాణ గురించి మాట్లాడే అర్హత లేదు

Posted On 2025-12-07 14:24:59

Readmore >
Image 1

పర్యాటక రాష్ట్రం గోవాలో భారీ అగ్నిప్రమాదం

Posted On 2025-12-07 08:40:10

Readmore >
Image 1

టెన్త్ విద్యార్థులకు స్టడీ మెటీరియల్ అందజేత

Posted On 2025-12-06 17:39:53

Readmore >
Image 1

హోంగార్డ్స్ 63 వ రైసింగ్ డే కార్యక్రమంలో పాల్గొన సిపి సాయి చైతన్య

Posted On 2025-12-06 16:17:59

Readmore >
Image 1

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 69వ వర్ధంతి వేడుకలు

Posted On 2025-12-06 16:16:40

Readmore >