Posted on 2025-11-13 14:03:56
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: టీ ఎస్ యూ టి ఎఫ్ ( తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్) సిరిసిల్ల మండల అధ్యక్షులు గా వంగ మల్లేశం ,ప్రధానకార్యదర్శి గా దాసరి చంద్రశేఖర్ లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జెడ్పిహెచెస్ అంబేడ్కర్ నగర్, సిరిసిల్ల పాఠశాల పాఠశాల ఆవరణ లో సిరిసిల్ల మండల మహాసభ నిర్వహించారు.ఈ సమావేశానికి ముఖ్యతిధి గా జిల్లా అధ్యక్షుడు పర్కాల రవీందర్ హాజరయ్యారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ సీనియర్ ఉపాధ్యాయులకు టెట్ నుండి మినహాయింపు ఇవ్వాలని,పెండింగ్ లో ఉన్న DA లను విడుదల చేయాలని, పిఆర్సీ ని వెంటనే ప్రకటించాలని,స్థానికత ఆధారంగా 317 బాధిత ఉపాధ్యాయులను సొంత జిల్లాలకు పంపించాలని ఆయన డిమాండ్ చేశారు.ఈ సందర్బంగా టి ఎస్ యూ టి ఎఫ్ సిరిసిల్ల మండల కమిటీ ని ఎన్నుకున్నారు.ఈ ఎన్నికకు జిల్లా కోశాధికారి అంబటి రమేష్ ఎన్నికల పరిశీలకులుగా వ్యవహరించారు.
కమిటీ వివరాలు
అధ్యక్షులు: వంగ మల్లేశం MPPS రాజీవ్ నగర్
ప్రధాన కార్యదర్శి: దాసరి చంద్రశేఖర్ MPPS బాబాజీ నగర్
ఉపాధ్యక్షుడు: బత్తిని అనిల్ కుమార్
ఉపాధ్యక్షురాలు: E. Vennela
కోశాధికారి: పల్లెవేని ఐలయ్య
కార్యదర్శులు:
జంగిటి భానుచందర్
గంగారాం
బైరి శ్రీనివాస్
రాములు
ఈ సందర్బంగాఅధ్యక్ష,, ప్రధానకార్యదర్శులు మాట్లాడుతూ ఉపాధ్యాయ సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తామని తెలిపారు.
సిరిసిల్లలో ఘనంగా కార్గిల్ విజయ్ దివస్... అమర వీరులకు నివాళి
Posted On 2026-07-26 14:47:28
Readmore >
జూలూరుపాడు మండలంలో ఎమ్మార్పీఎస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నాయకుల సమావేశం
Posted On 2026-07-26 14:40:51
Readmore >
భారతీయ జనతా పార్టీ కార్మిక విభాగం కామారెడ్డి జిల్లా కన్వీనర్ గా మహిపాల్ యాదవ్
Posted On 2026-07-26 14:34:52
Readmore >
గంప శశాంక్ జన్మదినం సందర్భంగా తల సేమియా చిన్నారుల కోసం రక్తదాన శిబిరం
Posted On 2026-07-26 14:33:18
Readmore >
MP వద్దిరాజు రవిచంద్ర ఆధ్వర్యంలో రూప్లా తండాలో బిఆర్ఎస్ పార్టీ లో భారీ చేరికలు
Posted On 2026-07-26 05:15:34
Readmore >