Posted on 2025-11-13 10:03:28
నిజామాబాద్ పోలీసులు కఠిన ఆదేశాలు జారీ
డైలీ భారత్, న్యూస్ నిజామాబాద్: మత్తు పదార్థాలు, గంజాయి, డ్రగ్స్, ఇతర మత్తు పానీయాల పట్ల తమ పిల్లలపై తల్లిదండ్రులు ఓ కన్నేసి ఉంచాలని లేకపోతే వాటికి బానిసై విద్యార్థి దశలోనే చిన్నారులు చెడు త్రోవ పట్టే అవకాశం లేకపోలేదని నిజామాబాద్ పోలీసులు తల్లిదండ్రులకు సూచించారు. అందుకే నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో యువత విద్యార్థుల వారి తల్లిదండ్రులు కేవలం వారి చదువు ఇతర కార్యకలాపాలపై దృష్టి పెట్టడమే కాకుండా వారు ఎటు వెళ్తున్నారు ఏక్కడి నుంచి వస్తున్నారు అంటూ ఓ కంట గమనిస్తూ ఉండాలని లేకపోతే సమాజానికి తీవ్ర ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందన్నారు. తమ పిల్లలు నిషేధిత అలాంటి గంజాయి డ్రగ్స్, మత్తు మాదక ద్రవ్యాలు తీసుకుంటున్నారని విషయం మొదట్లోనే గుర్తిస్తే అందుకు తగ్గ కౌన్సిలింగ్ ఇస్తే ఆ మహమ్మారి నుండి దూరంగా పడేయవచ్చు అని పోలీసులు తల్లిదండ్రులకు సూచిస్తున్నారు. మరోవైపు నూతన వెహికల్ చట్టం 2019 ప్రకారం కఠినంగా శిక్ష అమలు కాబోతుందని మొదటిసారిగా డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలో పట్టుబడితే 12000 నుంచి 15 వేల వరకు జరిమానా విధించడంతోపాటు ఆరు నెలల జైలు శిక్ష విధించడం జరుగుతుందన్నారు. కావున తల్లిదండ్రులు ఈ విషయాన్ని కూడా గమనించాలని కోరారు. ముఖ్యంగా యువత మద్యం సేవించి వాహనాలు నడపడం ద్వారా డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడి 12 వేల నుంచి 15000 దాకా జరమాన విధించడంతోపాటు ఆరు నెలల జైలు శిక్ష విధించడం వల్ల మీ కుటుంబంలోని మీ మధ్యలోనే తిరిగే మీ కుటుంబ సభ్యులు యువత జైలు శిక్ష అనుభవిస్తే ఎంత నరకంగా ఉంటుందో అర్థం చేసుకోండి అని పోలీసులు వారి వారి తల్లిదండ్రులకు సుతిమెత్తగా వారించారు. ప్రతిరోజు వాహనాలు తీసుకొని వెళ్లి మద్యం సాయి వస్తున్నారు అని రెండు మూడు రోజులు పాటు గమనిస్తే వెంటనే తమ పిల్లలకు వాహనాలు ఇవ్వకుండా నిరాకరించాలని పోలీసులు తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు.
హోంగార్డ్స్ 63 వ రైసింగ్ డే కార్యక్రమంలో పాల్గొన సిపి సాయి చైతన్య
Posted On 2025-12-06 16:17:59
Readmore >
కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 69వ వర్ధంతి వేడుకలు
Posted On 2025-12-06 16:16:40
Readmore >
అవినీతి, నిర్లక్ష్యం, అమలు కానీ హామీలు... ఇదే కాంగ్రెస్ 2 సంవత్సరాల పాలన
Posted On 2025-12-06 15:47:25
Readmore >
ఇద్దరు భార్యలతో నామినేషన్లుఏ భార్యను సర్పంచ్ చేయాలనే సందిగ్ధంలో భర్త
Posted On 2025-12-06 15:33:03
Readmore >
సూపర్ ఫాస్ట్ రైళ్లకు హాల్టింగ్ కల్పించండి... రద్దయిన రైళ్లను పునరుద్ధరించండి
Posted On 2025-12-06 15:32:07
Readmore >
అన్నాపాడు గ్రామానికి చెందిన డాక్టర్ బానోతు రమేష్ స్వామి సాయిరాం తండాలో ఇరుముడి కార్యక్రమం
Posted On 2025-12-06 15:30:17
Readmore >