Posted on 2025-11-10 21:26:11
ఎర్రకోట వద్ద ఘటనలో పలువురు దుర్మరణం
మరో 24 మందికి గాయాలు, ముగ్గురి పరిస్థితి విషమం
ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఆగగానే పేలిన కారు
పహల్గామ్ దాడి మరువక ముందే మరో విషాదం
రంగంలోకి దిగిన ఎన్ఐఏ, ఫోరెన్సిక్ బృందాలు
డైలీ భారత్, న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో భారీ బాంబు పేలుడు చోటుచేసుకుంది. ఎర్రకోట సమీపంలో సోమవారం సాయంత్రం జరిగిన ఓ కారు బాంబు పేలుడులో పలువురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 24 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనతో ఢిల్లీ ఒక్కసారిగా ఉలిక్కిపడింది.
ఈ ఘటనపై ఢిల్లీ పోలీస్ కమిషనర్ (సీపీ) మీడియాకు వివరాలు వెల్లడించారు. సాయంత్రం 6:52 గంటల సమయంలో ఎర్రకోట వద్ద ఉన్న ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఈ దుర్ఘటన జరిగిందని తెలిపారు. రెడ్ లైట్ పడటంతో ఓ కారు నెమ్మదిగా వచ్చి ఆగిందని, అది ఆగుతున్న సమయంలోనే భారీ శబ్దంతో పేలిపోయిందని వివరించారు.
పేలుడు తీవ్రత చాలా ఎక్కువగా ఉందని, మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా ఛిద్రమయ్యాయని సీపీ తెలిపారు. గాయపడిన వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. పేలుడు ధాటికి సమీపంలో ఉన్న అనేక వాహనాలు ధ్వంసం కాగా, కొన్ని వాహనాలు మంటల్లో పూర్తిగా దగ్ధమయ్యాయి.
సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారని సీపీ వెల్లడించారు. జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ), ఫోరెన్సిక్ నిపుణుల బృందాలు రంగంలోకి దిగి ఆధారాలు సేకరిస్తున్నాయని తెలిపారు.
డ్రంక్ అండ్ డ్రైవ్ పై పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్న మారని మందుబాబులు
Posted On 2025-12-07 19:45:50
Readmore >
చెప్పులు మెడలో వేసుకుని రాజీనామా చేస్తా : సర్పంచ్ అభ్యర్థిణి రాజేశ్వరి
Posted On 2025-12-07 18:39:01
Readmore >
పద్మశాలి విద్యార్థులు ఉన్నత విద్యలో ముందంజలో ఉండేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు
Posted On 2025-12-07 17:30:34
Readmore >
కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి తెలంగాణ గురించి మాట్లాడే అర్హత లేదు
Posted On 2025-12-07 14:24:59
Readmore >
హోంగార్డ్స్ 63 వ రైసింగ్ డే కార్యక్రమంలో పాల్గొన సిపి సాయి చైతన్య
Posted On 2025-12-06 16:17:59
Readmore >
కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 69వ వర్ధంతి వేడుకలు
Posted On 2025-12-06 16:16:40
Readmore >