Posted on 2025-11-10 21:47:26
నలుగురు నిందితుల అరెస్ట్.
నిందితులపై ఆంధ్రప్రదేశ్ లో 3 కేసు, సూర్యాపేట జిల్లాలో 4, జనగామ జిల్లాలో 1, నల్గొండ జిల్లాలో 1 కేసు గుర్తింపు.
నిందితుల నుండి 5 లక్షల విలువైన బంగారం 50వేల విలువైన వెండి రెండు బైకులు నాలుగు సెల్ ఫోన్లు సీజ్
జిల్లా పోలీస్ కార్యాలయం నందు ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశం నందు అరెస్టు వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ నరసింహ ఐపిఎస్
డైలీ భారత్, సూర్యాపేట: రాత్రి పూట ఆరుబయట నిద్రిస్తున్న వారిని లక్ష్యంగా చేసుకుని గత కొన్ని రోజులుగా సూర్యాపేట, నల్గొండ, జనగామ జిల్లాలో, ఆంద్రప్రదేశ్ లో కొన్ని జిల్లాలో బంగారు ఆభరణాలు దొంగతనం చేస్తున్న 4 గురు నిందితులను అర్వపల్లి మండల కేంద్రంలో జిల్లా CCS, అర్వపల్లి పోలీసు లు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించి పట్టుబడి చేయడం జరిగినది. CCS ఇన్స్పెక్టర్, నాగారం CI ఆధ్వర్యంలో కేసును చేదించడం జరిగినది. అక్టోబర్ నెల చివరి వారంలో అర్వపల్లి మండలంలో రెండు వరుస దొంగతనం కేసులు నమోదు అవ్వడం జరిగినది వీటిపై దర్యాప్తు చేస్తుండగా నమ్మదగిన సమాచారంపై ఈరోజు మధ్యాహ్నం CCS పోలీసులు, ఆర్వపల్లి ఆధ్వర్యంలో అర్వపల్లి మండల కేంద్రంలోని జంక్షన్ వద్ద తనిఖీలు నిర్వహిస్తుండగా రెండు ద్విచక్ర వాహనాలపై అనుమానాస్పదంగా వస్తున్న వ్యక్తులను ఆపి విచారించగా నలుగురు వ్యక్తులు ఆంధ్ర ప్రదేశ్ జిల్లాకు చెందిన వారిగా గుర్తించడం జరిగినది. వీరి వద్ద తనిఖీలు చేయగా రూ.5 లక్షల విలువైన 4.25 తులాల బంగారము, రూ.50 వేల విలువైన వెండి లభించింది, వీరు ప్రయాణిస్తున్న రెండు వాహనాలు , ఉపయోగిస్తున్న నాలుగు మొబైల్స్ ను స్వాధీనం చేసుకోవడం జరిగింది. విచారించగా గత నెలలో అర్వపల్లి, నాగారం, తుంగతుర్తి,శాలిగౌరారం పోలీస్ స్టేషన్ల పరిధిలో రాత్రిపూట దొంగతనాలు చేసినట్లు ఒప్పుకున్నారు అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో మరో మూడు దొంగతనాలు చేసినట్లు ఒప్పుకున్నారు.
రాత్రిపూట తలుపులు తీసిన నిద్రిస్తున్న ఇంట్లో, ఆరు బయట నిద్రిస్తున్న వారిని టార్గెట్గా చేసుకొని వారి మెడలో ఉన్న బంగారు ఆభరణాలు మరియు ఇంట్లో వస్తువులు దొంగలించడం వీరి యొక్క దొంగతనం శైలి.
నిందితులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చెందినవారు.
A1 - ఓలేటి మహాలక్షాల రావు @ మహా వయసు 23 సంవత్సరాలు వృత్తి కూలీ ఎదురులంక పోలవరం మండలం బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా.
A2 - గద్దెడ సురేంద్ర వయసు 25 సంవత్సరాలు చిన్న మల్ల విలేజ్, పెనుగొండ మండలం, వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్.
A3 - అల్లేటి రాజేష్ వయసు 26 సంవత్సరాలు వృత్తి కూలీ వీరభద్రపురం గ్రామం తణుకు మండలం వెస్ట్ గోదావరి జిల్లా.
A4 - వెంద్ర రాఘవేంద్రరావు వయసు 37 సంవత్సరాలు వృత్తి డ్రైవర్ వేదులూరు గ్రామం, వెస్ట్ గోదావరి జిల్లా.
ఈ నలుగురు నిందితులు రాత్రిపూట నిద్రిస్తున్న వారిని టార్గెట్ గా చేసుకొని ఆభరణాల దొంగతనాలకు పాల్పడ్డారు. ఈ నిందితులు తొమ్మిది కేసుల్లో దొంగతనాలు గుర్తించడం జరిగింది.
నిందితుల గత నేరచరిత్ర :
A1 నిందితుడు పై 37 కేసులు ఉన్నట్లు ఇతడు కాకినాడ జైలు నుండి తప్పించుకున్నట్లు సమాచారం ఉన్నది. A2 నిందితుడు పై 16 కేసులు గుర్తించాము. A3 నిందితుడిపై ఏడు కేసులు గుర్తించడం జరిగింది, A4 నిందితుడిపై కేసులను పరిశీలిస్తున్నాము.
ఈ ముఠాను పట్టుకోవడంలో విశేషంగా పనిచేసిన సి సి ఎస్ సి ఐ, సిసిఎస్ ఎస్ఐ,సిసిఎస్ స్టాఫ్, సిఏ నాగారం, ఎస్సై అర్వపల్లి మరియు సిబ్బందిని మెచ్చుకోవడం జరిగింది. ఈ కేసు విషయంలో ప్రతిభ కనబరిచిన సిబ్బందికి రివార్డులు అందజేయడం జరుగుతుంది.
ఈ కార్యక్రమంలో DSP ప్రసన్న కుమార్, CI నాగేశ్వరరావు, CCS SI హరికృష్ణ, అర్వపల్లి SI సైదులు, సిబ్బంది ఉన్నారు.
డ్రంక్ అండ్ డ్రైవ్ పై పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్న మారని మందుబాబులు
Posted On 2025-12-07 19:45:50
Readmore >
చెప్పులు మెడలో వేసుకుని రాజీనామా చేస్తా : సర్పంచ్ అభ్యర్థిణి రాజేశ్వరి
Posted On 2025-12-07 18:39:01
Readmore >
పద్మశాలి విద్యార్థులు ఉన్నత విద్యలో ముందంజలో ఉండేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు
Posted On 2025-12-07 17:30:34
Readmore >
కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి తెలంగాణ గురించి మాట్లాడే అర్హత లేదు
Posted On 2025-12-07 14:24:59
Readmore >
హోంగార్డ్స్ 63 వ రైసింగ్ డే కార్యక్రమంలో పాల్గొన సిపి సాయి చైతన్య
Posted On 2025-12-06 16:17:59
Readmore >
కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 69వ వర్ధంతి వేడుకలు
Posted On 2025-12-06 16:16:40
Readmore >