Posted on 2025-11-07 17:39:00
ఆస్పత్రిలో రోగులకు పండ్లు పంపిణి చేసిన నాయకులు
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ 75 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంలో శుక్రవారం జిల్లా కేంద్రంలో తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో పండ్ల పంపిణి చేసి వజ్రోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఐ ఎఫ్ డబ్ల్యూ జె జాతీయ కౌన్సిల్ మెంబర్ కుంచం శ్రీనివాస్ , టి డబ్ల్యూ జే ఎఫ్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు పనుగంటి శ్రీనివాస్, టి డబ్ల్యూ జే ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు కోరి రాకేష్ లు మాట్లాడుతూ ఇండియన్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ 28 అక్టోబర్ 1958లో ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. దేశవ్యాప్తంగా 30 వేల సభ్యత్వాలను నమోదు చేసుకొని 28 రాష్ట్రాలలో విజయవంతంగా తమ కార్యకలాపాలను కొనసాగిస్తుందని తెలిపారు. శ్రీలంక, నేపాల్, భూటన్ రాష్ట్రాలలోని సంఘాలతో సంబంధాలను సైతం కొనసాగిస్తూ విజయవంతంగా తమ కార్యకలాపాలను ముందుకు తీసుకు వెళ్లడం జరిగుతుందన్నారు. అనేక జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించుకోవడంతోపాటు, తమ హక్కులను కాపాడుకోవడం కోసం అనేక ఉద్యమాలు చేపట్టినట్లు గుర్తు చేశారు . నేడు తెలంగాణ రాష్ట్రంలో జర్నలిస్టుల సమస్యలు అపరిస్కృతంగా ఉన్నాయని, వాటి సాధన కోసం నిరంతరం ఉద్యమాలు చేయాలని అన్నారు. సమస్యల పరిష్కారం కోసం పోరాటం తప్ప మరో మార్గం లేదని అన్నారు. ముఖ్యంగా ప్రతి ఒక్క జర్నలిస్టుకు ఇండ్లు, ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, అదేవిధంగా షరతులు లేకుండా ప్రభుత్వ సంక్షేమ పథకాలను జర్నలిస్టుల కుటుంబాలకు వర్తింపజేయాలని అన్నారు. వర్కింగ్ జర్నలిస్ట్ లకు అక్రిడిటేషన్ విషయంలో గతంలో బి ఆర్ ఎస్ ప్రభుత్వం, నేటి కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తున్నాయని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హెల్త్ కార్డులు పని చేయడం లేదని, చివరికి ఆరోగ్యశ్రీ పథకమే దిక్కు అవుతుందని అన్నారు. జర్నలిస్ట్ ల హక్కుల సాధనకై పోరాటానికి సిద్దం కావాలని పిలుపునిచ్చారు.
హమాలీల సంఖ్య పెంచి అన్ లోడింగ్ చేయాలి: సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-05-26 10:43:36
Readmore >
కామారెడ్డి జిల్లాలో ‘డ్రంక్ అండ్ డ్రైవ్’ పై పోలీసుల ఉక్కుపాదం
Posted On 2026-05-26 08:13:24
Readmore >
అర్జీలు సకాలంలో పరిష్కరించాలి : జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-05-25 17:15:49
Readmore >