Posted on 2025-11-06 17:57:32
డైలీ భారత్, దమ్మన్నపేట:రాజన్న సిరిసిల్ల జిల్లా యోగా అసోసియేషన్ ఆధ్వర్యంలో వైశ్య భవన్ సిరిసిల్ల యందు నిర్వహించిన జిల్లా స్థాయి యోగ పోటీల్లో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల దమ్మున్నపేట యందు6వ తరగతి చదువుతున్న విద్యార్థి చిలుక సాకేత్ 10-12 వయస్సు విభాగంలో జిల్లా స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచి రాష్ట్రస్థాయికి ఎంపికయ్యాడు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు చింతపల్లి వెంకటేశ్వరరావు మరియు ఉపాధ్యాయ బృందం సాకేత్ ను ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత మాసంలో జరిగిన ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్థాయిలో కరాటే కింగ్ వ్యూ లో కూడా చాంపియన్షిప్ సాధించి బ్రాంజ్ మెడల్ పొందడం జరిగింది అని తెలిపారు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల దమ్మన్నపేట పాఠశాల విద్యార్థులు చదువు తో పాటు కోకరీకులర్ కార్యక్రమాలలో ఉన్నత స్థానంలో నిలవడం పాఠశాలకు గర్వకారణమని అన్నారు. ఈ ఈనెల 9వ తారీకు ఆదివారం రోజు జరిగే రాష్ట్ర స్థాయిలో కూడా ఎంపిక కావాలని ఆశాభావం వ్యక్తం చేశారు ఇట్టి కార్యక్రమంలో ఉపాధ్యాయులు బోయన్న గారి నారాయణ తాడూరి సంపత్ కుమార్ మారేపల్లి రాజు శనిగరం నారాయణ అజ్మీర కవిత జడల విజయశ్రీ మరియు విద్యార్థులు పాల్గొన్నారు.
అర్జీలు సకాలంలో పరిష్కరించాలి : జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-05-25 17:15:49
Readmore >
రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి మీడియా సమావేశం
Posted On 2026-05-25 15:10:05
Readmore >
అన్ లోడింగ్ లో జాప్యం కాకుండా పర్యవేక్షణ చేయాలి : జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-05-25 10:43:55
Readmore >