| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

రాష్ట్రస్థాయికి ఎంపికైన దాసరి సాత్విక

రాష్ట్రస్థాయికి ఎంపికైన దాసరి సాత్విక

డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా యోగా అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక వైశ్య భవన్ లో  నిర్వహించిన జిల్లా స్థాయి యోగ పోటీల్లో కుసుమ రామయ్య బాలుర ఉన్నత పాఠశాల సిరిసిల్ల లో 8వ తరగతి చదువుతున్న విద్యార్థిని 12-14 వయస్సు  విభాగంలో జిల్లా స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచి రాష్ట్రస్థాయికి ఎంపికైంది. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు లకావత్ మోతిలాల్ మరియు ఉపాధ్యాయ బృందం సాత్వికను ప్రత్యేకంగా అభినందించారు. కుసుమ రామయ్య బాలుర ఉన్నత పాఠశాల విద్యార్థులు చదువు తో పాటు కోకరీకులర్ కార్యక్రమాలలో ఉన్నత స్థానంలో నిలవడం పాఠశాలకు గర్వకారణమని అన్నారు. విద్యార్థిని ఎంపికకు కృషిచేసిన పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ దేవత ప్రభాకర్ ను ప్రత్యేకంగా అభినందించారు


ఈ కార్యక్రమంలో స్టాఫ్ సెక్రటరీ పాకాల శంకర్ గౌడ్ మరియు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Previous తల్లడిల్లి తనువు చాలించిన మూడు అనాధ మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించిన ఇందూరు యువత స్వచ్చంద సేవా సంస్థ
Next పెండింగ్ లో ఉన్న ఫీజు బకాయిలను చెల్లించాలని కోరుతూ టిఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముందు నిరసన
ADVERTISEMENT