| Daily భారత్
Logo




జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ ను గెలిపించండి

News

Posted on 2025-11-04 18:58:00

Share: Share


జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి  నవీన్ యాదవ్ ను గెలిపించండి

ఇంటికి ప్రచారంలో పాల్గొన్న రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి

డైలీ భారత్ న్యూస్, హైదరాబాద్ / నిజామాబాద్:

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ  ఎమ్మెల్యే అభ్యర్థి నవీన్ యాదవ్ గెలవబోతున్నారని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి అన్నారు. ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా హేమావతి నగర్, శారది సొసైటీ, జనప్రియ కాలనీ, ప్రభాత్ నగర్ ప్రాంతాల్లో ఆయన ప్రజలతో భేటీ అవుతూ, ఇంటింటికీ తిరిగి కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కు ఓటు వేసి గెలిపించాలని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి గల్లీ, ప్రతి వాడలో కాంగ్రెస్ వాతావరణం నెలకొంది. ప్రజలంతా మార్పు కోసం ఎదురుచూస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గారు జూబ్లీహిల్స్ లో భారీ మెజార్టీతో గెలవడం ఖాయం,” అన్నారు. గత ప్రభుత్వంలో జూబ్లీహిల్స్ నియోజకవర్గన్ని అభివృద్ధి చేయలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే మూడు నెలల్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గన్ని అభివృద్ధి పథంలో తీసుకువచ్చిందని అన్నారు. స్థానికంగా ఉండే వారికి ఓటేసి , కాంగ్రెస్ పార్టీని భారీ మెజారిటీతో గెలిపించాలని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి అన్నారు. భూపతిరెడ్డి తో పాటు ఈ ప్రచారంలో  డిచ్ పల్లి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పోలసాని శ్రీనివాస్, డీసీసీ ప్రధాన కార్యదర్శి భాస్కర్ రెడ్డి, మోపాల్ మండల అధ్యక్షులు సాయిరెడ్డి, ధర్పల్లి మండల  అధ్యక్షులు బాలరాజ్ ,మాజీ ఎంపీపీ గోపి, యూత్ నాయకులు ఉమ్మాజి నరేష్, మాజీ ఐ సి డి ఎం ఎస్ చైర్మన్ సాయిరెడ్డి, మాజీ జెడ్పిటిసి మోహన్, మాజీ సర్పంచులు భాగరెడ్డి, జనార్ధన్, చిన్న సాయిరెడ్డి, మాజీ ఎంపీటీసీ శంకర్, యువ నాయకుడు రాజేష్, శ్రీనివాస్,మల్లేష్ ప్రశాంత్, వినోద్, తిరుపతి తదితరులు పాల్గొన్నారు. ప్రచారం అంతటా కాంగ్రెస్ నినాదాలు మారుమ్రోగగా, స్థానికులు హర్షాతిరేకంగా పార్టీకి మద్దతు తెలుపుతున్నారన్నారు.

Image 1

మత్తు పదార్థాలు, గంజాయి, డ్రగ్స్ పదార్థాలకు తమ పిల్లలు బానిస కాకుండా తల్లిదండ్రులు ఓ కంట కనిపెట్టాలి

Posted On 2025-11-13 10:03:28

Readmore >
Image 1

టీఎన్జీవో ఉద్యోగుల సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభం

Posted On 2025-11-12 19:13:27

Readmore >
Image 1

జిల్లా కేంద్రంలో గురువారం జరిగే సుదర్శన్ రెడ్డి సన్మాన సభకు కాంగ్రెస్ కార్యకర్తలు తరలి రావాలి

Posted On 2025-11-12 19:12:07

Readmore >
Image 1

పాత కలెక్టరేట్ ప్రాంగణంలో ఘనంగా నవదుర్గ మాత ఆలయ 5వ వార్షికోత్సవ మహోత్సవం

Posted On 2025-11-12 19:10:42

Readmore >
Image 1

అధిక శబ్దం చేసే సైలెన్సర్లను రోడ్ రోలర్ తో తొక్కించిన పోలీసులు

Posted On 2025-11-12 19:09:07

Readmore >
Image 1

నిజంగా ఆ పెద్ద మనిషికి ప్రభుత్వ సలహాదారుడిగా సంతృప్తినిచ్చిందా..?

Posted On 2025-11-12 13:27:18

Readmore >
Image 1

సీఏ లో ఉత్తీర్ణత సాధించిన బొడ్డు సతీష్ ఆత్మీయ సత్కారం

Posted On 2025-11-12 08:51:49

Readmore >
Image 1

JNTUH -JAC చైర్మన్ & రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాల మహానాడు మంద రంజిత్ కుమార్ కి డాక్టరేట్ డిగ్రీ ప్రదానం

Posted On 2025-11-12 08:50:16

Readmore >
Image 1

బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడిగా చాపలమడుగు రామ్మూర్తి

Posted On 2025-11-12 08:48:19

Readmore >
Image 1

ప్రభుత్వ నిషేదిత గంజాయి వంటి మత్తు పదార్ధాలను రవాణా చేసే వ్యక్తుల సమాచారం అందించండి : జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్

Posted On 2025-11-12 08:47:02

Readmore >