Posted on 2026-05-24 08:57:09
చిన్నచిన్న నిర్లక్ష్యాలు ప్రాణ నష్టానికి దారితీయవచ్చు..
తల్లిదండ్రులు తమ పిల్లలను చెరువులు,కాలువలు, కుంటల వద్దకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: వేసవికాలంలో పాఠశాలలు, కళాశాలలకు సెలవులు రావడంతో ఎంతో మంది పిల్లలు యువకులు ఎండ వేడి నుంచి సేద తీరటానికి, ఈత నేర్చుకోవడానికి చెరువులు , కాలువల వద్దకు ఈతకు వెళ్లే అవకాశం ఉన్నందున ఇట్టి క్రమంలో ప్రమాదాలు జరిగి నీటిలో మునిగి ప్రాణ నష్టం జారిగే అవకాశం ఉన్నందున అందరూ ఇట్టి విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఈత సరదా విషాదంగా మారకూడదని జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే ఐపిఎస్ సూచించారు.
ఈత రానివారు బావులు,చెరువుల వద్దకు ఒంటరిగా వెళ్లకూడదని ఈత నేర్చుకునే వారు వారి తల్లిదండ్రుల సమక్షంలో నేర్చుకోవాలని సూచించారు. ముఖ్యముగా తల్లిదండ్రులు తమ పిల్లలను చెరువుల వద్దకు కాలువల వద్దకు కుంటలు వద్దకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
ఏదైనా అనుకోని సంఘటన జరిగినట్లయితే పిల్లల ప్రాణానికి ప్రమాదమని ఇట్టి విషయంలో తల్లిదండ్రులు తగు జాగ్రత్తలు తీసుకొని పిల్లలను యొక్క కదలికలను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలని ఎస్పీ తల్లిదండ్రులకు సూచించారు.
తెలుగు సాహిత్యానికి ప్రజాకవి కాళోజీ సేవలు చిరస్మరణీయం... ఎస్పీ మహేష్ బి.గితే
Posted On 2026-09-09 08:34:54
Readmore >
నామకరణ కార్యక్రమానికి హాజరైన రాష్ట్ర డైరెక్టర్ ఆర్.టి.ఐ చట్టం... ఎంఎ సలీం
Posted On 2026-09-08 18:02:08
Readmore >
కాంగ్రెస్ ప్రభుత్వ దుశ్శసన పాలనలో నేటి రోజు మహిళలోకానికి దుర్దినం
Posted On 2026-09-07 16:41:28
Readmore >
దోమకొండ పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ నిర్వహించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్
Posted On 2026-09-06 04:06:38
Readmore >