| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

తల సేమియా చిన్నారుల కోసం నిర్వహించిన మెగా రక్తదాన శిబిరం విజయవంతం

తల సేమియా చిన్నారుల కోసం నిర్వహించిన మెగా రక్తదాన శిబిరం విజయవంతం

146 యూనిట్ల రక్త సేకరణ, రక్తదానానికి కదిలిన కామారెడ్డి యువత

హెల్మెట్లను అందజేసి అభినందించిన పట్టణ సీఐ నరహరి

డైలీ భారత్, కామారెడ్డి: కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఆదిత్య హాస్పిటల్ సహకారంతో,కామారెడ్డి రక్తదాతల సమూహం ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ (ఐవిఎఫ్),ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సంయుక్తంగా తల సేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం నిర్వహించిన మెగా రక్తదాన శిబిరం విజయవంతమైందని ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్,రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు,ఐవిఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు,ఆదిత్య హాస్పిటల్ నిర్వాహకులు చిలువేరి మారుతి లు పేర్కొనడం జరిగింది.

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఇచ్చిన కామారెడ్డి పట్టణ సర్కిల్ ఇన్ స్పెక్టర్ ఆఫ్ పోలీస్ నరహరి మాట్లాడుతూ చిన్న పిల్లల ప్రాణాలను కాపాడడం కోసం ఆదిత్య హాస్పిటల్ నిర్వాహకులు చిలువేరి మారుతి, డాక్టర్ అజయ్ పేరాల,డాక్టర్ ఎన్ బాలు మెగా రక్తదాన శిబిరం నిర్వహించడం అభినందనీయమని, రక్తదానం చేసిన రక్త దాతలకు ట్రాఫిక్ నిబంధనల పట్ల అవగాహన కల్పించాలని ఉద్దేశంతో ఖర్చు వెనకడుగు వేయకుండా హెల్మెట్లను అందజేయడం సామాజిక బాధ్యత కు నిదర్శనమని అన్నారు యువత రక్త దానం చేయడానికి ముందుకు రావాలని రక్తదానం పట్ల ఉన్న అపోహలను విడనాలి సమాజ హితం కోసము ముందుకు కదలాలని అన్నారు రక్తదానం చేసిన రక్త దాతలకు ప్రశంసా పత్రాలను హెల్మెట్లను బహూకరించడం జరిగింది. 

ఈ కార్యక్రమంలో నిర్వాహకులు డాక్టర్ నీల బాలు, చిలువేరి మారుతి,డాక్టర్ అజయ్ పేరాల,కామారెడ్డి రక్తదాతల సమూహ అధ్యక్షుడు జమీల్ అహ్మద్,జిల్లా అధ్యక్షుడు ఎర్రం చంద్రశేఖర్,ప్రధాన కార్యదర్శి దొంతి సుధాకర్,కోశాధికారి కస్వ వెంకటేష్, మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి చిలువేరి శ్రీదేవి,కోశాధికారి రెడ్ క్రాస్ సొసైటీ ప్యాట్రన్ సభ్యులు డాక్టర్ జైపాల్ రెడ్డి ఆధ్యాత్మిక విభాగం అధ్యక్షులు ఎల్లంకి సుదర్శన్,అనంతుల అఖిల్,మందుల రామచంద్రం, బట్టు బరద్వాజ్,వంశీ,తల సేమియా బ్లడ్ బ్యాంక్ సభ్యులు పాల్గొనడం జరిగింది.

Previous మళ్లీ సీఎం కేసీఆర్ కావాలి తెలంగాణ బాగుండాలి
Next సీఎంఆర్‌ఎఫ్ ద్వారా ఎల్టీసీ మంజూరు పత్రం అందజేత
ADVERTISEMENT