డైలీ భారత్, ఖమ్మం: ఖమ్మంజిల్లా తల్లాడ మండలం నారాయణపురం గ్రామంలో తెలంగాణ రాష్ట్రం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మూడు నెలల రేషన్ బియ్యం అడ్డుదారులు తొక్కుతుంది, వివరాల్లోకెళితే ఆంధ్ర రాష్ట్రానికి చెందిన వ్యక్తి తనదైన శైలిలో అక్రమ రేషన్ రవాణా సరఫరా చేస్తూ ఉన్నాడు. కల్లూరు మండల పరిధిలోని రేషన్ డీలర్ షాపు నుండి ఆంధ్ర రాష్ట్రానికి తరలిస్తుండగా విశ్వసనీయ సమాచారం మేరకు తల్లాడ మండల పరిధిలోని నారాయబంజర గ్రామంలో అక్రమంగా రవాణా చేస్తున్న AP 39 TY 1851 ) ఎస్ ఎం ఎల్ వాహనంలో 100 బస్తాల రేషన్ బియ్యాన్ని అధికారులు పట్టుకున్నారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేషన్ దందాను ఎంత అరికట్టిన అక్రమార్కుల మాత్రం గుట్టు చప్పుడు కాకుండా రేషన్ దందాను కొనసాగిస్తున్నారు, ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు స్పందించి అక్రమార్కుల ఆగడాలను అరికట్టవలసినదిగా పేద ప్రజలు ఆవేదన వ్యక్త పరుస్తున్నారు.