| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

ఓ మహిళపై అసభ్యకరంగా ప్రవర్తించిన కామాంధులైన డాక్టర్, రియల్ ఎస్టేట్ వ్యాపారిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు

ఓ మహిళపై అసభ్యకరంగా ప్రవర్తించిన కామాంధులైన డాక్టర్, రియల్ ఎస్టేట్ వ్యాపారిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు

నిందితులపై నిర్భయ కేసు నమోదు..

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:సోమవారం ఓ మహిళ నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కు తనపై నగరానికి చెందిన ఓ డాక్టర్, అతనితో ఉండే రియల్ ఎస్టేట్ వ్యాపారి లైంగికంగా వేధిస్తున్నారంటూ వారిపై చర్యలు తీసుకోవాలని సదరు మహిళ సీపీకి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.. ఈ నేపథ్యంలో సిపి ఆదేశాల ప్రకారం రంగంలోకి దిగిన నాలుగోవటం ఈ నేపథ్యంలో సిపి ఆదేశాల ప్రకారం రంగంలోకి దిగిన 4 టౌన్ పోలీసులు విచారణ దర్యాప్తు ప్రారంభించారు. మహిళలను వేధించిన  ఆయిల్ గంగాధర్, కొండ అమర్ అనే ఇద్దరు ఆమెతో అసభ్యకరంగా ప్రవర్తిస్తూ, ఆడియో కాల్స్, వీడియో కాల్స్ చేస్తూ వెంటపడుతూ, వేధిస్తున్నారని ఫిర్యాదు మేరకు వారిరువురిపై సంబంధిత సెక్షన్ల ప్రకారము  కేసునమోదు చేయడం జరిగిందని ఎస్ఐ శ్రీకాంత్ తెలిపారు. ఈ ఘటన  విషయంలో విచారణ జరిపి నిందితులపై చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటామని 4 టౌన్ ఎస్సై శ్రీకాంత్ స్పష్టం చేశారు. ఆ ఇద్దరి వ్యక్తులపై నిర్భయ కేసు నమోదు అయినట్లు జిల్లాలో ప్రచారం కొనసాగుతుంది. కాగా కామాంధులైన ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది.

Previous కిసాన్ మోర్చా నేషనల్ ప్రెసిడెంట్‌గా మద్దిశెట్టి నియామకం
Next జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ ను గెలిపించండి
ADVERTISEMENT