Posted on 2025-11-03 20:46:48
బయటకు చెప్పుకోలేక, ఇంట్లో చెప్పుకోలేక సంవత్సరం పాటు నరక వేదన
వివాహితకు డెంటల్ డాక్టర్ అతని స్నేహితుడు రియాల్టర్ వేదింపులు
కమిషనర్ కు ఫిర్యాదు చేస్తున్న సమయంలోనే వాట్సాప్ కాల్ చేసిన ప్రబుద్ధులు
షాక్ గురైన సిపి..వెంటనే కేసు నమోదు చేయాలని ఆదేశించిన పోలీసు కమిషనర్
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:ఉపాధి కోసమో, ఉద్యోగం కోసమో, చదువు కోసమో బయటకు వెళ్లిన మహిళలకు రక్షణ లేకుండాపోతుంది. తాజాగా నిజామాబాద్ లో ఓ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.
నిజామాబాద్ నగరానికి చెందిన ఓ యువతి తన వివాహానికి ముందు ట్రావెల్ కార్యాలయంలో రిసెప్షనిస్టుగా పని చేసేది. ఏడాది క్రితం వివాహం జరుగగా భర్త కోరిక మేరకు ప్రైవేట్ జాబ్ ను వదులుకుని ఇంటి వద్దే ఉంటుంది. తాను ట్రావెల్ ఏజంట్ కార్యాలయంలో పని చేసే చోట యజమాని భామ్మర్థి శ్రీనగర్ కాలనీకి చెందిన వ్యక్తి తాను రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నామని యువతితో మాటలు కలిపాడు. ఆమె ఫోన్ నంబర్ తీసుకుని అప్పట్లో వెకిలి చేష్టలు చేసేవాడు. ఎక్కడ ఈ విషయం చెబితే యజమాని తన ఉద్యోగం తీసేస్తాడేమోనని, ఇంట్లో చెబితే ఉద్యోగం మానేయాలని కుటుంబ సభ్యులు చెబుతారేమోనని యువతి భయపడి అంతర్గతంగానే కుమిలిపోయింది. అదే సమయంలో నగరంలో డాక్టర్ల కాలనీగా పేరున్న ఖలీల్ వాడికి చెందిన డెంటల్ డాక్టర్ గా పని చేస్తున్న మరో వ్యక్తి టూరిస్టు వీసా కోసం ట్రావెల్ కార్యాలయంకు వచ్చి యువతి నంబర్ తీసుకున్నాడు. అతను కూడా యువతిని తరుచుగా వేదించడం ప్రారంభించాడు. ఒక వైపు రియాల్టర్, మరో వైపు డెంటల్ డాక్టర్ వేదింపులు భరించలేక ఏడాది క్రితం ఉద్యోగం మానేసి వివాహం చేసుకుంది.
ఇటీవల కాలంలో పెళ్లయిన వివాహితకు రియల్ ఎస్టేట్ వ్యాపారి, దంత వైద్యుడి వేదింపులు ఎక్కువయ్యాయి. న్యూడ్ కాల్ చేస్తే రూ.5 వేలు ఇస్తామని, గెస్ట్ హౌజ్ కు వస్తే రూ.10 వేలు ఇస్తామని వాట్సాప్ కాల్, వీడియో కాల్స్ చేసి వేదించడం మొదలుపెట్టారు. నగరంలోని స్టార్ హోటల్ ను బుక్ చేసామని రావాలని కోరుతూ కాల్స్ చేసి వేదింపులకు గురి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం పోలీసు ప్రజావాణి సందర్భంగా సదరు వివాహిత పోలీసు కమిషనర్ కు తన గోడును వెళ్లబోసుకుంది. అదే సమయంలో వివాహితకు వాట్సాప్ కాల్ రాగా స్వయంగా పరిశీలించిన పోలీసు కమిషనర్ ఉన్నఫళంగా కేసు నమోదు చేయాలని స్థానిక పోలీస్ స్టేషన్ ఎస్ హెచ్ వోను ఆదేశించారు.
హోంగార్డ్స్ 63 వ రైసింగ్ డే కార్యక్రమంలో పాల్గొన సిపి సాయి చైతన్య
Posted On 2025-12-06 16:17:59
Readmore >
కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 69వ వర్ధంతి వేడుకలు
Posted On 2025-12-06 16:16:40
Readmore >
అవినీతి, నిర్లక్ష్యం, అమలు కానీ హామీలు... ఇదే కాంగ్రెస్ 2 సంవత్సరాల పాలన
Posted On 2025-12-06 15:47:25
Readmore >
ఇద్దరు భార్యలతో నామినేషన్లుఏ భార్యను సర్పంచ్ చేయాలనే సందిగ్ధంలో భర్త
Posted On 2025-12-06 15:33:03
Readmore >
సూపర్ ఫాస్ట్ రైళ్లకు హాల్టింగ్ కల్పించండి... రద్దయిన రైళ్లను పునరుద్ధరించండి
Posted On 2025-12-06 15:32:07
Readmore >
అన్నాపాడు గ్రామానికి చెందిన డాక్టర్ బానోతు రమేష్ స్వామి సాయిరాం తండాలో ఇరుముడి కార్యక్రమం
Posted On 2025-12-06 15:30:17
Readmore >