Posted on 2025-11-03 20:07:15
ఈ ఘటన తనను తీవ్రంగా కలిసి వేసింది..
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:చేవెళ్ల మండలం మీర్జాపూర్ సమీపంలో చోటుచేసుకున్న బస్ ప్రమాదం దురదృష్టకరమని, ఈ ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ తెలిపారు. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు, గాయపడిన వారికి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇలాంటి ఘోర ప్రమాదాలు మళ్లీ జరగకుండా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలి. నిర్లక్ష్యంగా నడిపే కంకర టిప్పర్ల వలన అమాయక ప్రజల ప్రాణాలు బలికావడం విచారకరమన్నారు. ప్రమాదానికి కారణమైన టిప్పర్ యజమానుల లైసెన్సులు తక్షణమే రద్దు చేయాలి. నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసిన డ్రైవర్లపై కఠిన చర్యలు తీసుకోవాలి. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించాలి. గాయపడిన వారికి మెరుగైన వైద్యం కల్పించాలి” అని కోరారు. అలాగే, రాష్ట్రంలో పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలపై రవాణాశాఖ ప్రత్యేక దృష్టి పెట్టి, నియంత్రణ లేని టిప్పర్ వాహనాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రజల ప్రాణాలకు భద్రత కల్పించడం ప్రభుత్వ ప్రాధాన్యతగా మారాలని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
మత్తు పదార్థాలు, గంజాయి, డ్రగ్స్ పదార్థాలకు తమ పిల్లలు బానిస కాకుండా తల్లిదండ్రులు ఓ కంట కనిపెట్టాలి
Posted On 2025-11-13 10:03:28
Readmore >
జిల్లా కేంద్రంలో గురువారం జరిగే సుదర్శన్ రెడ్డి సన్మాన సభకు కాంగ్రెస్ కార్యకర్తలు తరలి రావాలి
Posted On 2025-11-12 19:12:07
Readmore >
పాత కలెక్టరేట్ ప్రాంగణంలో ఘనంగా నవదుర్గ మాత ఆలయ 5వ వార్షికోత్సవ మహోత్సవం
Posted On 2025-11-12 19:10:42
Readmore >
అధిక శబ్దం చేసే సైలెన్సర్లను రోడ్ రోలర్ తో తొక్కించిన పోలీసులు
Posted On 2025-11-12 19:09:07
Readmore >
నిజంగా ఆ పెద్ద మనిషికి ప్రభుత్వ సలహాదారుడిగా సంతృప్తినిచ్చిందా..?
Posted On 2025-11-12 13:27:18
Readmore >
JNTUH -JAC చైర్మన్ & రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాల మహానాడు మంద రంజిత్ కుమార్ కి డాక్టరేట్ డిగ్రీ ప్రదానం
Posted On 2025-11-12 08:50:16
Readmore >
ప్రభుత్వ నిషేదిత గంజాయి వంటి మత్తు పదార్ధాలను రవాణా చేసే వ్యక్తుల సమాచారం అందించండి : జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్
Posted On 2025-11-12 08:47:02
Readmore >