| Daily భారత్
Logo




వైరా మున్సిపాలిటీలో అభివృద్ధి పనులు ప్రారంభించాలి

News

Posted on 2025-11-02 13:32:58

Share: Share


వైరా మున్సిపాలిటీలో అభివృద్ధి పనులు ప్రారంభించాలి

మంజూరైన నిధులు సక్రమంగా ఖర్చు చేయాలి

అన్ని వార్డులో సైడ్ డ్రైనేజ్ నిర్మించాలి.

సిపిఐ(ఎం) వైరా  డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం

డైలీ భారత్, ఖమ్మం జిల్లా: సిపిఐ(ఎం) పోరాట ఫలితంగా వైరా మున్సిపాలిటీ అభివృద్ధికి మంజూరైన 15 కోట్ల రూపాయల నిధులతో అభివృద్ధి పనులను ప్రభుత్వం, అధికారులు వెంటనే ప్రారంభించాలని, మంజూరైన నిధులను సక్రమంగా వినియోగించాలని సిపిఐ(ఎం) వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం ప్రభుత్వాన్ని కోరారు. సిపిఐ(ఎం) సుందరయ్య నగర్ శాఖ - 2  సమావేశం మాడపాటి మల్లికార్జునరావు అధ్యక్షతన జరిగింది. ఈ  సమావేశంలో భూక్యా వీరభద్రం మాట్లాడుతూ మున్సిపాలిటీ పరిధిలోని అన్ని వార్డుల్లో సైడ్ డ్రైనేజ్ వ్యవస్థను పూర్తిగా నిర్మించాలని ఆయన డిమాండ్ చేశారు. వర్షం పడ్డప్పుడల్లా మురుగు నీళ్లు నిలువ ఉండటం వలన అధిక దోమలు వృద్ధి చెంది ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారని అన్నారు. నిలిచిపోయిన మురుగు నీటిని మున్సిపాలిటీ అధికారులు తక్షణమే తొలగించాలని, సీజనల్ వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

స్థానికంగా ప్రజలు ఎదుర్కొంటున్న పలు రకాల సమస్యలపై సిపిఎం ఆధ్వర్యంలో అనేక ఆందోళన పోరాటాలు చేయాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశంలో శాఖా కార్యదర్శి, పట్టణ నాయకులు గుడిమెట్ల మోహన్ రావు, మాడపాటి వెంకటేశ్వరరావు, సామినేని నరసింహారావు, భూక్యా విజయ, మాడపాటి సుజాత, మోదుగు నాగరాణి తదితరులు పాల్గొన్నారు.

Image 1

ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కలకలం..

Posted On 2026-07-26 17:19:21

Readmore >
Image 1

సదాశివనగర్‌లో కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం నిర్వహించిన ఎల్లారెడ్డి డీఎస్పీ ఎస్. శ్రీనివాస్ రావు

Posted On 2026-07-26 16:55:36

Readmore >
Image 1

బీబీపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో పేకాట స్థావరంపై పోలీసుల దాడి – నలుగురిపై కేసు నమోదు

Posted On 2026-07-26 16:52:48

Readmore >
Image 1

28న "ఛలో కలెక్టరేట్" కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి

Posted On 2026-07-26 16:51:12

Readmore >
Image 1

సిరిసిల్లలో ఘనంగా కార్గిల్ విజయ్ దివస్... అమర వీరులకు నివాళి

Posted On 2026-07-26 14:47:28

Readmore >
Image 1

జూలూరుపాడు మండలంలో ఎమ్మార్పీఎస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నాయకుల సమావేశం

Posted On 2026-07-26 14:40:51

Readmore >
Image 1

గాంధారి మండలంలో ఎమ్మార్పీఎస్ జండా ఆవిష్కరణ

Posted On 2026-07-26 14:36:26

Readmore >
Image 1

భారతీయ జనతా పార్టీ కార్మిక విభాగం కామారెడ్డి జిల్లా కన్వీనర్ గా మహిపాల్ యాదవ్

Posted On 2026-07-26 14:34:52

Readmore >
Image 1

గంప శశాంక్ జన్మదినం సందర్భంగా తల సేమియా చిన్నారుల కోసం రక్తదాన శిబిరం

Posted On 2026-07-26 14:33:18

Readmore >
Image 1

పనిమనుషుల నియామకంలో నిర్లక్ష్యం తగదు!

Posted On 2026-07-26 12:36:09

Readmore >