డైలీ భారత్, రంగారెడ్డి: రంగారెడ్డి జిల్లా బాకారం గ్రామ రెవెన్యూ లోని డ్రీమ్ వ్యాలీ రిసార్ట్ పక్కన గుర్తుతెలియని మహిళ మృతదేహం సోమవారం కలకలం రేపింది. కాగా.. మహిళ మృతదేహం మంటల్లో కాలుతున్నట్లుగా స్థానికులు గుర్తించారు.
వారు వెంటనే మొయినా బాద్ పోలీసులకు సమా చారం అందజేశారు. పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి వచ్చారు. పోలీసులు వచ్చే వరకు కూడా మహిళ మృతదేహం కాలుతునే ఉంది. మంటలను పోలీ సులు ఆర్పి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
మృతదేహం పక్కన సగం కాలిన ఫోన్ ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. ఆమె హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. అయితే ఆ మహిళను ఎక్కడో హత్యచేసి ఇక్కడకు తీసుకొచ్చి తగులబెట్టారా.. లేక ఇక్కడే హత్య చేసి మృతదేహన్ని తగుల బెట్టారా అనే వివరాలు పోలీసుల దర్యాప్తులో తెలియాల్సి ఉంది.
ఆధారాల కోసం క్లూస్ టీమ్‌ని రంగంలోకి దింపారు. చుట్టూ పక్కల ఉన్న వారిని పోలీసులు విచారిస్తున్నారు. ఆధారాల కోసం ఆ ఏరి యాలోని సీసీ కెమెరాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. రాజేంద్ర నగర్ అడిషనల్ డీసీపీ సాధన రేష్మి పెరు మాళ్ ఘటన స్థలానికి చేరుకుని విచారిస్తున్నారు.