| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

ఏసీబీకి చిక్కిన ట్రాన్స్‌కో ఏఈ

ఏసీబీకి చిక్కిన ట్రాన్స్‌కో ఏఈ

డైలీ భారత్, కామారెడ్డి: వాహనాల అద్దె విషయంలో కాంట్రాక్టర్‌ వద్ద నుంచి రూ.12,500 రూపాయల లంచం తీసుకుంటూ ట్రాన్స్‌కో ఏఈ ఈరోజు ఏసీబీ చిక్కాడు.

వివరాల్లోకి వెళ్తే..కామారెడ్డి 33 /11 కేవీ సబ్ స్టేషన్‌లో అసిస్టెంట్ ఇంజినీర్‌గా పని చేస్తున్న రాజు వాహనాల అద్దె విషయంలో కాంట్రాక్టర్‌ డ్రైవర్ భైరవ స్వామి వద్ద నుంచి లంచం డిమాండ్‌ చేశాడు.

దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయిం చాడు. వారి సూచనల మేరకు కామారెడ్డి సబ్‌ స్టేషన్‌లో రూ.12,500 ఇస్తుండగా ఏసీబీ అధికా రులు రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Previous డ్రంకన్ డ్రైవ్ లో పట్టుబడితే కఠిన చర్యలు
Next రంగారెడ్డి జిల్లాలో కాలుతున్న మహిళ మృతదేహం లభ్యం
ADVERTISEMENT