Posted on 2025-10-30 08:55:57
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల:ఇటీవలి వర్షాల కారణంగా ధాన్యం తడిసి రైతులు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో, భారతీయ జనతా పార్టీ సిరిసిల్ల పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు ఉదయం చిన్న బోనాల వడ్ల కొనుగోలు కేంద్రం వద్ద పరిస్థితిని పరిశీలించారు.
ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షులు దుమాల శ్రీకాంత్ మాట్లాడుతూ...
“రైతు పంట తడిసి నష్టపోతున్నా, ప్రభుత్వం మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం దురదృష్టకరం. వెంటనే నష్టపోయిన రైతులకు సరైన నష్టపరిహారం ప్రకటించి, పాడైపోయిన ధాన్యాన్ని ప్రభుత్వం సేకరించాలి.” శ్రీకాంత్ అన్నారు.
అలాగే ఆయన తీవ్రంగా విమర్శిస్తూ
“రైతుల కన్నీళ్లు తుడవడంలో విఫలమైన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల నమ్మకాన్ని కోల్పోయింది. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రైతు కష్టాలపై ఒక్క చర్య కూడా తీసుకోలేదు. ఫొటోలు, ప్రకటనలతో కాకుండా రైతు పంటను కాపాడటమే నిజమైన పాలన.” అని హెచ్చరించారు.
భారతీయ జనతా పార్టీ ఎల్లప్పుడూ రైతు పక్షానే ఉంటుంది. రైతు న్యాయం కోసం, పంట రక్షణ కోసం అవసరమైతే వీధుల్లోకి వచ్చి పోరాటం చేస్తాం. అని శ్రీకాంత్ తెలిపారు.
త్వరగా కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి వాహనాలు హమాళీ గోనె సంచుల వ్యవస్థ ఏర్పాటు చేసుకోవాల్సిందిగా డిమాండ్ చేశారు
ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ ఉపాధ్యక్షులు కంబోజు శ్రీధర్, నరసయ్య, ప్రధాన కార్యదర్శి మెరుగు శ్రీనివాస్ కిసాన్ మోర్చా అధ్యక్షులు సుంకరి బాలకిషన్, అధికార ప్రతినిధి చొప్పదండి శ్రీనివాస్, దూడం సురేష్, కార్యదర్శి శివరాం వినయ్ దేవరాజు, ఇంజపురం మురళి, గాలి శ్రీనివాస్ వడ్నాల శేఖర్ బాబు రామారావు వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.
మహారాష్ట్రలో మరో భవన ప్రమాదం... భివండిలో అర్ధరాత్రి కూలిన అపార్ట్‌మెంట్
Posted On 2026-07-31 07:06:38
Readmore >
పెద్ది సుదర్శన్ రెడ్డి మృతి రాష్ట్ర రాజకీయాలకు తీరని లోటు : బాదావత్ బాలాజీ
Posted On 2026-07-31 05:05:36
Readmore >
సీనియర్ న్యాయవాది రజాక్ మృతి తీరని లోటు : సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు
Posted On 2026-07-31 05:03:03
Readmore >
అశ్వాపురం మండలంలో సీతారామ పంప్ హౌస్ ను సందర్శించిన బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర మహిళా నాయకురాలు పవని గౌడ్
Posted On 2026-07-31 05:01:23
Readmore >
నలుగు నిమిషాల్లో ఘటనాస్థలికి చేరి, నలుగు ప్రాణాలు కాపాడిన పోలీసులు
Posted On 2026-07-30 17:36:26
Readmore >
సుల్తానాబాద్ బాలసదన్ నుంచి తప్పిపోయిన ఇద్దరు మైనర్ బాలికలను 12 గంటల్లోనే సురక్షితంగా గుర్తించిన పోలీసులు
Posted On 2026-07-30 17:09:03
Readmore >
సిరిసిల్ల : వర్షపు నీటితో అల్లాడుతున్న శ్రీనగర్ కాలనీవాసులు
Posted On 2026-07-30 16:35:13
Readmore >