Posted on 2025-10-30 08:44:28
డైలీ భారత్, హైదరాబాద్:నగరంలోని ఘౌస్‌నగర్ ప్రాంతంలో నిన్న అర్ధరాత్రి జరిగిన హత్య సంఘటన స్థానికులను తీవ్ర ఆందోళనకు గురి చేసింది. HKGN పాన్‌షాప్ యజమాని మొహ్సిన్(35) పై గుర్తు తెలియని నలుగురు దుండగులు కత్తులతో దాడి చేసి హతమార్చారు. సమాచారం అందుకున్న వెంటనే బండ్లగూడ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ప్రాంతాన్ని ముట్టడించారు. క్లూస్ టీమ్ ఆధ్వర్యంలో ఆధారాల సేకరణ కొనసాగుతోంది. మొహ్సిన్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
దాడి వెనుక గల కారణం ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. వ్యక్తిగత విభేదాలు, వ్యాపార వివాదం లేదా పాత విరోధమా అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రాంతంలోని CCTV ఫుటేజీలను సేకరించి నిందితుల కదలికలను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. “మృతుని కుటుంబ సభ్యుల వాంగ్మూలం ఆధారంగా నిందితులను త్వరలోనే పట్టుకుంటాం,” అని బండ్లగూడ ఇన్స్పెక్టర్ తెలిపారు. ఈ ఘటనతో ఘౌస్‌నగర్‌లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.
దేశ సరిహద్దులకు 15 కి.మీ పరిధిలో ఉన్న అక్రమ నిర్మాణాలు కూల్చేయాలి : అమిత్ షా
Posted On 2026-05-27 18:46:07
Readmore >
ఖమ్మం : హైడ్రాలిక్, ఎలక్ట్రో - మెకానికల్ వెహికల్ లిఫ్టర్‌ను ప్రారంభించిన పోలీస్ కమిషనర్
Posted On 2026-05-27 16:58:02
Readmore >
ఇందిరా మహిళా శక్తి భవనాలను సభ్యులు సద్వినియోగం చేసుకోవాలి : జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-05-27 16:43:06
Readmore >
అకాల వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండి ధాన్యం రక్షణ చర్యలు చేపట్టాలి : జిల్లా కలెక్టర్ అంకిత్ IAS
Posted On 2026-05-27 16:39:20
Readmore >
కొనుగోళ్ళు సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-05-27 16:35:33
Readmore >
వివోఏల నిరవధిక సమ్మెకు బిఆర్ఎస్ నేత ఏనుగు మనోహర్ రెడ్డి సంఘీభావం...
Posted On 2026-05-27 16:31:01
Readmore >