Posted on 2023-09-11 08:32:20
డైలీ భారత్, నల్గొండ జిల్లా:నల్గొండ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో ఇవాళ తెల్లవారుజామున అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది మాతాశిశు ఆరోగ్య కేంద్రం స్టోర్ రూంలో షాక్ సర్క్యూట్తో ఈ ఘటన జరిగినట్లు తెలిసింది.
స్టోర్ రూమ్లో చెలరేగిన మంటలు ఇతర వార్డులకు వెంట వెంటనే వ్యాపించాయి. స్టోర్ రూమ్లో ఉన్న బ్లీచింగ్ పౌడర్ మండటంతో దట్టమైన పొగలు అలుముకున్నాయి. పొగలు వ్యాపించడంతో వార్డుల్లో ఉన్న రోగులు ఇబ్బందులు పడ్డారు. ప్రమాదం జరిగిన విషయం తెలిసిన వెంటనే చిన్నారులతో సహా తల్లులు బయటకు పరుగులు తీశారు.
పొగ దట్టంగా అలుముకోవడంతో సిబ్బంది అప్రమత్తమైంది. వెంటనే పొగ బయటకు పోయేలా కిటికీల అద్దాలు పగలగొట్టారు. ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో ఆస్పత్రి సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకున్నారు. మంటలు పూర్తిగా ఆర్పిన తర్వాత.. షార్ట్ సర్క్యూట్ వల్లే ఘటన చోటుచేసుకుందని తెలిపారు.
మరోవైపు దట్టమైన పొగ వల్ల చిన్నారులు ఊపిరి పీల్చుకునేందుకు కష్టమవుతోందని తల్లులు ఆవేదన వ్యక్తం చేశారు
దోమకొండ పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ నిర్వహించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్
Posted On 2026-09-06 04:06:38
Readmore >
ప్రజల ఆర్యోగం కోసమే ఉచితమెగా వైద్య శిబిరం : సర్పంచ్ గీత వీరేశం గుప్త
Posted On 2026-09-04 17:43:14
Readmore >
రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి డాక్టర్ బాలు ఎంపిక
Posted On 2026-09-04 14:25:00
Readmore >
100 రోజుల హామీకి 1000 రోజుల నిరీక్షణ... సిరిసిల్లలో బీఆర్ఎస్ వంటావార్పు
Posted On 2026-09-04 12:11:03
Readmore >
హామీల గురించి మాట్లాడే హక్కు బీఆర్ఎస్ కు లేదు : సంగీతం శ్రీనివాస్
Posted On 2026-09-04 12:09:51
Readmore >
ఎల్లారెడ్డిపేటలో బీఆర్ఎస్ నేతల వినూత్న నిరసన... కేసు నమోదు చేసిన పోలీసులు
Posted On 2026-09-04 08:53:55
Readmore >