| Daily భారత్
Logo




గరీబ్ రథ్ ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదం

News

Posted on 2025-10-18 12:32:47

Share: Share


గరీబ్ రథ్ ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదం

గరీబ్ రథ్ ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదం.. త్రుటిలో పెను ప్రమాదం నుంచి బయటపడ్డ ప్రయాణికులు

గరీబ్ రథ్ ఎక్స్‌ప్రెస్‌లో చెలరేగిన మంటలు

బోగీ నుంచి పొగలు రావడంతో రైలు నిలిపివేత

ఘటనలో మూడు కోచ్‌ల దగ్ధం

ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని పోలీసుల వెల్లడి

అగ్నిప్రమాద కారణాలపై కొనసాగుతున్న దర్యాప్తు

డైలీ భారత్, పంజాబ్: పంజాబ్ ప్రయాణికులతో వెళుతున్న గరీబ్ రథ్ ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదం సంభవించినా, సిబ్బంది అప్రమత్తతతో అందరూ సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటన సిర్హింద్ రైల్వే స్టేషన్ సమీపంలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... అమృత్‌సర్ నుంచి సహర్సా వెళుతున్న గరీబ్ రథ్ ఎక్స్‌ప్రెస్ రైలు (Train No. 12204) అంబాలాకు అర కిలోమీటరు దూరంలో ఉండగా, ఒక బోగీ నుంచి దట్టమైన పొగలు రావడాన్ని సిబ్బంది, ప్రయాణికులు గమనించారు. దీంతో వెంటనే అప్రమత్తమైన లోకో పైలట్ రైలును నిలిపివేశారు. ప్రయాణికులు భయాందోళనతో కిందికి దిగి పరుగులు తీశారు.

సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. ప్రయాణికులను సకాలంలో రైలు నుంచి దించివేయడంతో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని సిర్హింద్ జీఆర్‌పీ ఎస్‌హెచ్‌ఓ రతన్ లాల్ తెలిపారు. అయితే, ఈ ప్రమాదంలో మూడు కోచ్‌లు మంటల్లో కాలిపోయినట్లు ఆయన వివరించారు.

ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని, ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని రైల్వే అధికారులు వెల్లడించారు. ఈ సంఘటనతో ఆ మార్గంలో రైళ్ల రాకపోకలకు కొద్దిసేపు అంతరాయం ఏర్పడింది. అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి ప్రయాణికులను తమ గమ్యస్థానాలకు పంపించారు.

Image 1

మెదడు చికిత్సలు మరింత సులభం : సికింద్రాబాద్ యశోద హాస్పిటల్ డాక్టర్ బీజే రాజేష్

Posted On 2026-07-02 17:57:45

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల జిల్లా : వేయించిన పల్లీల్లో పెండల పురుగు..

Posted On 2026-07-02 17:51:43

Readmore >
Image 1

మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్న వైరా నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు

Posted On 2026-07-02 17:42:33

Readmore >
Image 1

ఇందిరమ్మ ఇళ్లను సెప్టెంబర్ 17 నాటికి పూర్తి చేయాలి.. ప్రభుత్వం ఆదేశాలు

Posted On 2026-07-02 12:30:41

Readmore >
Image 1

ఎస్సైని లంచ్‌ టైం వరకు నిలబెట్టిన హైకోర్టు!

Posted On 2026-07-02 12:29:56

Readmore >
Image 1

జీవన రక్ష అవార్డు గ్రహీత డాక్టర్ పల్స హరీష్ గౌడ్

Posted On 2026-07-01 17:29:10

Readmore >
Image 1

దళిత అవార్డు అందుకున్న ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆర్ బాగయ్యకు సన్మాన మహోత్సవం

Posted On 2026-07-01 17:28:05

Readmore >
Image 1

మహబూబాబాద్ జిల్లా సింగారం గ్రామంలో మాజీ సర్పంచ్ దారుణ హత్య

Posted On 2026-07-01 16:22:02

Readmore >
Image 1

"సిరిసిల్లలో కలకలం : బాలాజీ స్వీట్ షాప్ మిక్చర్‌లో బల్లి, యజమానిపై కేసు నమోదు"

Posted On 2026-07-01 07:14:21

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల జిల్లాలో గల్ఫ్ ఏజెంట్ మోసం బట్టబయలు : తల్లి అరెస్ట్, కొడుకు కోసం గాలింపు

Posted On 2026-06-30 18:35:12

Readmore >