| Daily భారత్
Logo




ఏసీబీకి చిక్కిన మత్స్య శాఖ అధికారులు

News

Posted on 2025-10-17 19:45:05

Share: Share


ఏసీబీకి చిక్కిన మత్స్య శాఖ అధికారులు

డైలీ భారత్ న్యూస్, హన్మకొండ: మత్స్య పారిశ్రామిక సహకార సంఘం లో నూతన సభ్యులను నమోదు చేసేందుకు లంచం డిమాండ్ చేసిన హనుమకొండ జిల్లా మత్స్యశాఖ అధికారులను శుక్రవారం ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండగా పట్టుకున్నారు. వివరాల్లోకి వెళితే నర్సంపేట మాదన్నపేటకు చెందిన మత్స్య పారిశ్రా మిక సంఘంలో నూతన సభ్యుల పేర్లను నమోదు చేయాలని ఆ సంఘం 2023లో జిల్లా కార్యా లయంలో వినతిపత్రం సమర్పించారు. అయితే అప్పటి అధికారి హైదరాబాద్ ప్రధాన కార్యాలవానికి పంపించేందుకు అన్ని సిద్ధం చేశాడు. ఈ క్రమంలోనే ఆ అధికారి బదిలీపై వెళ్లిపోయాడు. ఆ స్థానంలో నాగమణి వీధిలో చేరి సంవత్సరన్నర అయింది. అయితే గత అధికారి నమోదు చేయాలని సభ్యుల లిస్టు ఇచ్చామని ప్రస్తుత అధికారులు నమోదు చేయాలని సంఘ సభ్యులు విజ్ఞప్తి చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో ఫైల్ హైదరాబాద్ ప్రధాన కార్యాలనికి పంపించారు. అయితే అక్కడ అధికారులు జిల్లా పరిధిలోనే నమోదు చేసుకునే అధికారం జిల్లా డిఎఫ్ ఓ కు ఉందని తిరిగి ఆ ఫైలును పంపించారు. ఇదే అదనంగా భావించిన డిఎఫ్ నాగమణి సొసైటీ నుంచి రూ.80 వేల రూపాయలు లంచాన్ని డిమాండ్ చేసింది. ఈ క్రమంలో సొసైటీ అధ్యక్షులు ఈ విషయంపై ఏసీబీ నాశ్రయించాడు. అందులో భాగంగానే శుక్రవారం కార్యాలయంలో ఉన్న ఫీల్డ్ ఆఫీసర్ హరీష్, డీ ఎఫ్ ఓ నాగమణి డబ్బులు తీసు కుంటున్న క్రమంలో ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండ్ గా  పట్టుకున్నారు.జిల్లా అధికారిని నాగమణి ఆదేశాల మేరకు కొత్త సభ్యులను సొసైటీలో చేర్చడం కోసం తను లంచం డిమాండ్ చేసినట్లు హరీష్ ఒప్పుకున్నాడు. దీంతో ఇద్దరిని శనివారం ఏసీబీ కోర్ట్ లో హాజరు పరచ నున్నట్లు ఏసీబీ డి.ఎస్.పి సాంబయ్య తెలిపారు. ప్రభుత్వ అధికారులు ఏదైనా పని కోసం లంచం డిమాండ్ చేస్తే ఏసీబీ టోల్ ఫ్రీ నెంబర్ 1064 కి కాల్ చేసి సమాచారం అందించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ తో పాటు ఎస్సై, కానిస్టేబుల్స్, సిబ్బంది పాల్గొన్నారు.

Image 1

లేడీ డీఎస్పీ నిర్వాకం.. అసలు గుట్టు విప్పిన రూరల్ పోలీసులు

Posted On 2026-05-09 06:27:23

Readmore >
Image 1

ఈవీఎం గోదాంను పరిశీలించిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్

Posted On 2026-05-08 20:04:24

Readmore >
Image 1

మద్దతుపై మాట్లాడే హక్కు లేదు.. బీజేపీ కౌన్సిలర్లకు బీఆర్ఎస్ కౌంటర్..

Posted On 2026-05-08 20:03:36

Readmore >
Image 1

జర్నలిస్టుల ఐక్యతకు నూతన వేదిక..

Posted On 2026-05-08 20:00:11

Readmore >
Image 1

జిల్లాలోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో సమర్థవంతంగా విధులు నిర్వర్తించిన బాంబు డిస్పోజల్ బృందం సిబ్బందిని అభినందించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు

Posted On 2026-05-08 19:58:59

Readmore >
Image 1

రోడ్డు ను ఆక్రమించి ఇంటి నిర్మాణం... పలుమార్లు ప్రజావాణిలో ఫిర్యాదు

Posted On 2026-05-08 19:20:14

Readmore >
Image 1

నకిలీ యజమానుల అవతారమెత్తి రూ. 16 లక్షల మోసం

Posted On 2026-05-08 19:16:53

Readmore >
Image 1

మీ పిల్లల భవిష్యత్తు భద్రమేనా.. ! (ఇది మీ కోసమే)

Posted On 2026-05-08 19:15:06

Readmore >
Image 1

ప్రపంచ వేదికపై భారతీయ కళ

Posted On 2026-05-08 17:38:38

Readmore >
Image 1

పిల్లల హక్కులను కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత : ఆడెపు వేణు, లోక్ అదాలత్ సభ్యులు

Posted On 2026-05-08 17:04:59

Readmore >