Posted on 2025-10-17 19:12:19
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: ప్రేమకు కులం, మతం, జాతులు, దేశాలు వేరైనా తమ ప్రేమను గెలిపించుకుంటామని నిరూపించుకున్నారు ఓ యువ జంట. ప్రేమను గెలిపించుకోవడమే కాదు కుటుంబ పెద్దలను ఒప్పించి మరి తెలంగాణ సాంప్రదాయ పద్ధతిలో పెళ్లి జరుపుకున్నారు ఆ నవ వధువు, వరుధులు.. దేశం కానీ దేశం లో ప్రేమించుకొని భారతీయ సంప్రదాయం పద్దతిలో పెళ్లి చేసుకున్న నేపాల్ అమ్మాయి, తెలంగాణ అబ్బాయి పెళ్లివేడుక కామారెడ్డి జిల్లా మహమ్మద్ నగర్ మండలంలో జరిగింది. మహమ్మద్ నగర్ మండలం తెలగపూర్ గ్రామానికి చెందిన రవీందర్ గత ఐదు సంవత్సరాలుగా దుబాయ్ లో జాబ్ చేస్తున్నాడు. అక్కడే తన ఆపీస్ లో పనిచేస్తున్న నేపాల్ యువతీ తో ప్రేమలో పడ్డాడు. ఇరు కుటుంబాలు వీరి ప్రేమకు ఒప్పుకోవడంతో యువతీ యువకుడు ఇండియా కు వచ్చి గురువారం గ్రామంలో ఘనంగా పెళ్లివేడుక చేసుకున్నారు. నూతన దంపతులను గ్రామస్తులు, నాయకులు ఆశీర్వదించారు. భారతీయ సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకోవడం ఆనందంగా ఉన్నదని పెళ్లి కూతురు సంతోషం వ్యక్తం చేశారు. తిరిగి నెల రోజుల్లో దుబాయ్ వెళ్ళిపోతున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. భారతీయ సాంప్రదాయం ఇక్కడి వారి ప్రేమ ఆప్యాయత ఎంతో బాగుంటుందని తాము ప్రేమించి పెళ్లి చేసుకున్నాక ఇక్కడి పద్ధతులు తెలుసొచ్చాయని నేపాల్ వధువు తన మనసులో మాట వారి కుటుంబ సభ్యులతో పంచుకున్నారు.
మెదడు చికిత్సలు మరింత సులభం : సికింద్రాబాద్ యశోద హాస్పిటల్ డాక్టర్ బీజే రాజేష్
Posted On 2026-07-02 17:57:45
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లా : వేయించిన పల్లీల్లో పెండల పురుగు..
Posted On 2026-07-02 17:51:43
Readmore >
మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్న వైరా నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు
Posted On 2026-07-02 17:42:33
Readmore >
ఇందిరమ్మ ఇళ్లను సెప్టెంబర్ 17 నాటికి పూర్తి చేయాలి.. ప్రభుత్వం ఆదేశాలు
Posted On 2026-07-02 12:30:41
Readmore >
దళిత అవార్డు అందుకున్న ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆర్ బాగయ్యకు సన్మాన మహోత్సవం
Posted On 2026-07-01 17:28:05
Readmore >
"సిరిసిల్లలో కలకలం : బాలాజీ స్వీట్ షాప్ మిక్చర్‌లో బల్లి, యజమానిపై కేసు నమోదు"
Posted On 2026-07-01 07:14:21
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లాలో గల్ఫ్ ఏజెంట్ మోసం బట్టబయలు : తల్లి అరెస్ట్, కొడుకు కోసం గాలింపు
Posted On 2026-06-30 18:35:12
Readmore >