| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

వరకట్న వేధింపులతో గర్భిణీ ఆత్మహత్య

వరకట్న వేధింపులతో గర్భిణీ ఆత్మహత్య

బీర్కూర్ మండలంలో విషాదం.. పిల్లల ముందే గర్భిణీ ఆత్మహత్య

గ్రామంలో నెలకొన్న విషాదఛాయలు..

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:బీర్కూర్ మండలంలో విషాదం చోటుచేసుకుంది. వరకట్న వేధింపులతో వివాహిత ఆత్మహత్య చేసుకుంది. స్థానిక ఎస్సై  మహేందర్ వివరాల ప్రకారం.. వర్ని మండలం సేవాలాల్ తండాకు చెందిన నాగరాణి(25)కి బీర్కూర్ మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన సంతోష్ తో  ఐదేళ్ల క్రితం పెళ్లి జరిగింది. ఆమెను రెండేళ్ల నుంచి అదనపు కట్నం  కోసం భర్త సంతోష్ వేధిస్తున్నాడు. గురువారం ఇద్దరి మధ్య గొడవ జరిగింది దీనితో మనస్తాపానికి గురై నాలుగు నెలల గర్భిణీగా ఉన్న నాగరాణి పిల్లల ముందే ఉరేసుకుని మృతి చెందింది. దీంతో గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి.

Previous సాక్షి దినపత్రిక పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్న కక్ష్య సాధింపు చర్యలను వెంటనే మానుకోవాలి
Next ఐరాడ్, ఈడార్ లను విజయవంతంగా నిర్వహిస్తూ రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు
ADVERTISEMENT