Posted on 2025-10-16 22:21:04
డైలీ భారత్ న్యూస్, నర్సంపేట/నల్లబెల్లి : సమాజంలో ప్రతి ఒక్కరూ హెచ్ఐవి పైన అవగాహన కలిగి ఉండాలని నల్లబెల్లి వైద్య అధికారి పిబి ఆచార్య, వై ఆర్ జి కేర్ లింక్ వర్కర్ స్కీమ్ డిఆర్పి ఎండి ముస్తాక్ అన్నారు. నల్లబెల్లి మండల కేంద్రంలో గురువారం లింక్ వర్కర్ స్కీం ఆధ్వర్యంలో నిర్వహించిన హెచ్ఐవి పై అవగాహన ర్యాలీని నల్లబెల్లి మండల వైద్య అధికారి ఆచార్య జెండా ఊపి ప్రారంభించి మాట్లాడారు. హెచ్ఐవి నాలుగు మార్గాల ద్వారానే వ్యాప్తి చెందుతుంది అసురక్షిత లైంగిక సంబంధాలు, కలుషితమైన రక్తమార్పిడి, కలుషితమైన సూదులు చిరంజీలు, హెచ్ఐవి ఉన్న తల్లిదండ్రులకు పుట్టే పిల్లలకు వ్యాపిస్తుందని అన్నారు. మరి ఏ పద్ధతుల ద్వారా హెచ్ఐవి వ్యాపించదు. హెచ్ఐవి వారిపట్ల వివక్షత చూపకుండా మనలో ఒకరిగా ఆదరించాలని కోరారు. అనంతరం మండల కేంద్రంలోని మండల సమైక్య కార్యాలయంలో నిర్వహించిన వివో మీటింగులో డిఆర్పి ముస్తాక్ మాట్లాడుతూ హెచ్ఐవి, ఎస్.టి.ఐ వ్యాప్తి, నివారణ మార్గాల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో వై ఆర్ జి కేర్ మిల్క్ వర్కర్ స్కీం ప్రతినిధులు సామల వీరన్న, జరుపుల లింగన్న, మురళి, స్థానిక యువకులు, గ్రామ పెద్దలు, వైద్య సిబ్బంది, అంగన్వాడి టీచర్లు, ఆశ వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.
దళిత అవార్డు అందుకున్న ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆర్ బాగయ్యకు సన్మాన మహోత్సవం
Posted On 2026-07-01 17:28:05
Readmore >
"సిరిసిల్లలో కలకలం : బాలాజీ స్వీట్ షాప్ మిక్చర్‌లో బల్లి, యజమానిపై కేసు నమోదు"
Posted On 2026-07-01 07:14:21
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లాలో గల్ఫ్ ఏజెంట్ మోసం బట్టబయలు : తల్లి అరెస్ట్, కొడుకు కోసం గాలింపు
Posted On 2026-06-30 18:35:12
Readmore >
ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ లోని పీఎం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నూతన తరగతి గదులు ప్రారంభించిన జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే
Posted On 2026-06-30 18:09:24
Readmore >
ఎక్సైజ్ సూపర్డెంట్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు R భాగయ్య
Posted On 2026-06-30 18:03:18
Readmore >
మూడు దశాబ్దాలకు పైగా పోలీసు శాఖలో విశిష్ట సేవలు అందించిన నలుగురు అధికారులకు ఘన వీడ్కోలు
Posted On 2026-06-30 18:02:24
Readmore >
శ్రీ సర్వదేవ పరంజ్యోతి భగవతి ఆలయం కల్కి ఆలయంలో అన్న ప్రసాద వితరణ
Posted On 2026-06-30 18:00:06
Readmore >
పదవీ విరమణ పొందిన ఉషయ్యకు ఘన సన్మానం చేసి శుభాకాంక్షలు తెలిపిన మున్సిపల్ ఛైర్పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్
Posted On 2026-06-30 17:58:38
Readmore >