| Daily భారత్
Logo




బీసీలను మరోసారి మోసం చేసిన కాంగ్రెస్ : నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి

News

Posted on 2025-10-16 22:18:29

Share: Share


బీసీలను మరోసారి మోసం చేసిన కాంగ్రెస్ : నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి

డైలీ భారత్ న్యూస్, వరంగల్ /నర్సంపేట: రేవంత్ రెడ్ది సర్కార్ ఇచ్చిన జిఓ 9ను సుప్రీం కొట్టి వేసిన పరిస్థితిలు చూస్తుంటే కాంగ్రెస్ పార్టీకి బిసిలపై ఉన్న ప్రేమ కపట ప్రేమేనని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నారు.గురువారం పత్రిక లకు ఇచ్చిన సమాచారం మేరకుఆయనమాట్లాడుతూ.

అసెంబ్లీ ఎన్నికలకు ముందు కామారెడ్డి డిక్లరేషన్ పేరుతో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను అమలు చేస్తామని మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ నేడు ఆ హామీని నిలబెట్టుకోలేక బీసీలను మోసం చేస్తుందన్నారు.బీసీ లకు రాజకీయ,విద్య, ఉద్యోగ అవకాశాలలో 42 శాతం రిజర్వేషన్ అమలుపైన కాంగ్రెస్ పార్టీకి  చిత్తశుద్ధి లేదని,రేవంత్ సర్కార్ కపట ప్రేమను బీసీల పైన చూపిస్తూ 42 శాతం రిజర్వేషన్  అందకుండా రాజ్యాంగ విరుద్ధంగా జీవోలను ,ఆర్డినెన్స్ లను, చట్టాలను చేస్తూ బీసీలను నయవంచనకు గురిచేస్తుందని విమర్శించారు.హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవో 9 పైన స్టే విధిస్తే అదే జీవో సుప్రీంకోర్టులో చెల్లదని తెలిసి సుప్రీంకోర్టును ఆశ్రయించడం ఎంత సమంజసమని ప్రశ్నించారు.బీహార్ రాష్ట్రంలో జరిగే ఎన్నికల కోసం హైకోర్టు,సుప్రీం కోర్టులలో చేల్లని జీవోలను తీసుకువచ్చి రాజకీయ లబ్ధి కోసం ప్రయత్నం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ నిజస్వరూపాన్ని తెలంగాణ బీసీ సమాజం గమనిస్తున్నదన్నారు.దేశంలో ప్రధాన ప్రతిపక్ష నేత హోదాలో ఉన్న రాహుల్ గాంధీ ,కాంగ్రెస్ పార్టీ పార్లమెంటులో బిసి రిజర్వేషన్ చట్టం తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయడం లేదని,ఒక్క రోజుకూడా పార్లమెంటును స్తంభింప చేయలేదన్నారు.రాష్ట్రంలో మాత్రం స్థానిక సంస్థల ఎన్నికలలో  బీసీలకు  42 శాతం రిజర్వేషన్ల కోసం  హడావుడి చేస్తున్నట్టు  నటిస్తున్నారని అన్నారు.రాష్ట్రంలో, కేంద్రంలో అధికారంలో ఉన్న రెండు జాతీయ పార్టీలు కాంగ్రెస్ మరియు బీజేపీ కుట్రల వలనే నేడు బీసీలకు రిజర్వేషన్ ఫలాలు అందడం లేదన్నారు.కాంగ్రెస్ పార్టీ బీసీలకు చేస్తున్న మోసాన్ని ఎండగడుతూ,ఈనెల 18న బీసీ సంఘాల ప్రతినిధులు ఇచ్చిన బంద్ కు బిఆర్ఎస్ పార్టీ మద్దతు తెలియజేస్తున్నదని అన్నారు.నియోజకవర్గంలోని బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఈ  బంద్ కార్యక్రమంలో ప్రత్యక్షంగా పాల్గొని 42 శాతం బీసీ రిజర్వేషన్ల అమలుకు కాంగ్రెస్ పార్టీ పైన పోరాటం చేయాలని పిలుపునిచ్చారు.

Image 1

జీవన రక్ష అవార్డు గ్రహీత డాక్టర్ పల్స హరీష్ గౌడ్

Posted On 2026-07-01 17:29:10

Readmore >
Image 1

దళిత అవార్డు అందుకున్న ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆర్ బాగయ్యకు సన్మాన మహోత్సవం

Posted On 2026-07-01 17:28:05

Readmore >
Image 1

మహబూబాబాద్ జిల్లా సింగారం గ్రామంలో మాజీ సర్పంచ్ దారుణ హత్య

Posted On 2026-07-01 16:22:02

Readmore >
Image 1

"సిరిసిల్లలో కలకలం : బాలాజీ స్వీట్ షాప్ మిక్చర్‌లో బల్లి, యజమానిపై కేసు నమోదు"

Posted On 2026-07-01 07:14:21

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల జిల్లాలో గల్ఫ్ ఏజెంట్ మోసం బట్టబయలు : తల్లి అరెస్ట్, కొడుకు కోసం గాలింపు

Posted On 2026-06-30 18:35:12

Readmore >
Image 1

ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ లోని పీఎం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నూతన తరగతి గదులు ప్రారంభించిన జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే

Posted On 2026-06-30 18:09:24

Readmore >
Image 1

ఎక్సైజ్ సూపర్డెంట్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు R భాగయ్య

Posted On 2026-06-30 18:03:18

Readmore >
Image 1

మూడు దశాబ్దాలకు పైగా పోలీసు శాఖలో విశిష్ట సేవలు అందించిన నలుగురు అధికారులకు ఘన వీడ్కోలు

Posted On 2026-06-30 18:02:24

Readmore >
Image 1

శ్రీ సర్వదేవ పరంజ్యోతి భగవతి ఆలయం కల్కి ఆలయంలో అన్న ప్రసాద వితరణ

Posted On 2026-06-30 18:00:06

Readmore >
Image 1

పదవీ విరమణ పొందిన ఉషయ్యకు ఘన సన్మానం చేసి శుభాకాంక్షలు తెలిపిన మున్సిపల్ ఛైర్పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్

Posted On 2026-06-30 17:58:38

Readmore >