Posted on 2025-10-16 19:28:53
వైద్య అధికారుల పని తీరు మెరుగు పడాలి
నిరుపేదలకు మెరుగైన వైద్యం అందాలి
డైలీ భారత్, జనగాం: ప్రభుత్వ ఆసుపత్రుల మీద ప్రజలకు ఎంతో నమ్మకం ఉంటుందని దాన్ని కాపాడుకునే విధంగా వైద్య అధికారులు సేవాలాందించాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు
వైద్య సేవలకు సంబందించిన వివిధ అంశాల మీద పీహెచ్ సి ల వారీగా...జిల్లా వైద్య అధికారి, అన్ని పీహెచ్ సి ల మెడికల్ అధికారులు, సూపరవైజర్ లతో జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ సమీక్షించారు
ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ...
ప్రభుత్వం పేదలకు మెరుగైన వైద్యం అందించేందుకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని....దీన్ని దృష్టిలో పెట్టుకొని వైద్య సేవల విషయం లో మెడికల్ అధికారులు బాధ్యత యుతం గా పని చేయాలన్నారు
కార్పొరేట్ ఆసుపత్రి లకు దీటుగా ప్రభుత్వ ఆసుపత్రి లలో అత్యాధునిక వైద్య పరికరాలు, యంత్రాలు ఉన్నాయన్నారు
అందుకు తగ్గట్టు గా డాక్టర్ లు తమ విధులను నిర్వర్తించాలన్నారు
ప్రసవాలు కేవలం ప్రభుత్వ ఆసుపత్రి లోనే జరగాలని..
క్లస్టర్ లెవల్ సమీక్షా సమావేశాలు నిర్వహించి పురోగతి సాధించాలన్నారు
మాతృ ఆరోగ్యం & పోషణ కార్యక్రమం (MHN), క్యాన్సర్, మధుమేహం, గుండె సంబంధిత వ్యాధులు & స్ట్రోక్ నివారణ & నియంత్రణ జాతీయ కార్యక్రమం (NPCDCS), బాల ఆరోగ్యం మరియు టీకా కార్యక్రమం, జాతీయ క్షయ వ్యాధి నిర్మూలన కార్యక్రమం (NTEP), వెక్టార్ బోర్న్ వ్యాధి నియంత్రణ కార్యక్రమం (NVBDCP), సీజనల్ వ్యాధులు తదితర కార్యక్రమాల పురోగతి ని కలెక్టర్ ప్రతీ పీహెచ్ సి మెడికల్ అధికారి ని అడిగి తెలుసుకున్నారు
ఫీల్డ్ స్థాయి పర్యవేక్షణను మరింత బలపరచాలని, నివేదికల ఖచ్చితత్వాన్ని మెరుగుపరచాలని, అన్ని ఆరోగ్య సూచికలను సమయానికి సాధించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు.
ముఖ్యంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో సాధారణ ప్రసవాల సంఖ్య పెంపుపై దృష్టి సారించాలని, ప్రసవాలు జరపని వైద్యాధికారులపై శూన్య సహనం (Zero Tolerance) విధించాలని, అలాగే తీవ్ర, మధ్యస్థ పోషకాహార లోపం (SAM/MAM) ఉన్న పిల్లల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపించాలని ఆదేశించారు.
తక్కువ పనితీరు కనబరిచిన ప్రాంతాల్లో ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, గ్రామస్థాయిలో అన్ని ఆరోగ్య కార్యక్రమాలు సమర్థవంతంగా అమలు చేయాలని వైద్యాధికారులకు సూచించారు.
జిల్లా లో వైరల్, డెంగ్యూ జ్వరాలు ప్రబల కాకుండా తగు చర్యలు తీసుకోవాలని... ఫీవర్ సర్వే ను నవంబర్ 15 వరకు కొనసాగించాలన్నారు
జిల్లా లోని ప్రభుత్వ రీసెడెన్షియల్ విద్య సంస్థ లలో చదువుతున్న ప్రతీ విద్యార్థి కి ఇచ్చిన హెల్త్ కార్డు లో ఉన్న పరీక్ష లను నెలరోజులో పూర్తి చేయాలన్నారు
పేద కుటుంబాలకు చెందిన విద్యార్థుల చదువు తో పాటు వారి ఆరోగ్యన్ని కూడా కాపాడలిసిన అవసరం మెడికల్ అధికారుల మీద ఉందని గమనించాలన్నారు
ఈ సమావేశానికి డా. కె. మల్లిఖార్జున రావు, జిల్లా వైద్య & ఆరోగ్య అధికారి, ప్రోగ్రాం అధికారులు, PHC & RBSK వైద్యాధికారులు, రిపోర్టింగ్ సూపర్వైజర్లు, ఇతర జిల్లా ఆరోగ్య సిబ్బంది హాజరయ్యారు.
దళిత అవార్డు అందుకున్న ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆర్ బాగయ్యకు సన్మాన మహోత్సవం
Posted On 2026-07-01 17:28:05
Readmore >
"సిరిసిల్లలో కలకలం : బాలాజీ స్వీట్ షాప్ మిక్చర్‌లో బల్లి, యజమానిపై కేసు నమోదు"
Posted On 2026-07-01 07:14:21
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లాలో గల్ఫ్ ఏజెంట్ మోసం బట్టబయలు : తల్లి అరెస్ట్, కొడుకు కోసం గాలింపు
Posted On 2026-06-30 18:35:12
Readmore >
ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ లోని పీఎం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నూతన తరగతి గదులు ప్రారంభించిన జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే
Posted On 2026-06-30 18:09:24
Readmore >
ఎక్సైజ్ సూపర్డెంట్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు R భాగయ్య
Posted On 2026-06-30 18:03:18
Readmore >
మూడు దశాబ్దాలకు పైగా పోలీసు శాఖలో విశిష్ట సేవలు అందించిన నలుగురు అధికారులకు ఘన వీడ్కోలు
Posted On 2026-06-30 18:02:24
Readmore >
శ్రీ సర్వదేవ పరంజ్యోతి భగవతి ఆలయం కల్కి ఆలయంలో అన్న ప్రసాద వితరణ
Posted On 2026-06-30 18:00:06
Readmore >
పదవీ విరమణ పొందిన ఉషయ్యకు ఘన సన్మానం చేసి శుభాకాంక్షలు తెలిపిన మున్సిపల్ ఛైర్పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్
Posted On 2026-06-30 17:58:38
Readmore >