| Daily భారత్
Logo




నిజామాబాద్ అర్బన్, నగర కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో భాగంగా బ్లాక్ A, బ్లాక్ B ముఖ్య కార్యకర్తలతో సన్నాహక సమావేశం

News

Posted on 2025-10-16 17:36:10

Share: Share


నిజామాబాద్ అర్బన్, నగర కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో భాగంగా బ్లాక్ A, బ్లాక్ B ముఖ్య కార్యకర్తలతో సన్నాహక సమావేశం

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:సంఘటన్ సృజన్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా కాంగ్రెస్ పార్టీని ప్రక్షాళన చేయాలని నిర్ణయించిందన్నారు. పార్టీ కోసం శ్రమించి కష్టపడి విధేయతగా ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుందని, ఇందులో భాగంగానే నిజామాబాద్  నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుని ఎన్నిక కోసం నిజామాబాదు అర్బన్ నియోజకవర్గ విస్తృత స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశం నిజామాబాద్ పట్టణంలోని హరిత హోటల్ లో నిర్వహించారు. ఏఐసిసి అబ్జర్వర్  రిజ్వాన్ అర్షద్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్, నిజామాబాద్ పట్టణ ఇంచార్జ్ ఎమ్మెల్సీ వెంకట్ బాల్మూర్, మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్, రవి బాబు, పాల్గొన్నారు.నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గ ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించి  బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, జిల్లా అనుబంధ సంఘా అధ్యక్షులుతో డివిజన్ అధ్యక్షులు మాజీ కార్పొరేటర్ల తోసమావేశం నిర్వహించి వారి అభిప్రాయాన్ని స్వీకరించారు. అధ్యక్ష పదవి కోరుకునే వారి ద్వారా దరఖాస్తులకు ఆహ్వానించారు.

ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీని  14 సంవత్సరాలుగా ఎలాంటి ప్రలోభాలకు బెదిరింపులకు భయపడకుండా ముందుకు నడిపించిన కేశ వేణు కి అభినందనలు తెలిపారు. సంఘటన్ సృజన్ అభియాన్ దేశవ్యాప్త కార్యక్రమం ఇది పార్టీని పటిష్టం చేయడానికి పార్టీ కోసం కష్టపడే వారిని గుర్తించి వారికి పదవులు ఇవ్వడానికి, దేశవ్యాప్తంగా యువత, మహిళలు, అణగారిన వర్గాల గొంతుక వినిపించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందన్నారు. కాంగ్రెస్ ప్రజల కోసం పోరాడుతుంది అని చెప్పారు. ఏఐసిసి అబ్జర్వర్ రిజ్వాన్ ఆర్షద్  మాట్లాడుతూ పార్టీ సిద్ధాంతం కులం, మతం సంబంధం లేకుండా సమాజంలోని అన్ని వర్గాల సంక్షేమాన్ని లక్ష్యంగా చేసుకుని అందరినీ కలుపుకుని పోతుందని ఆయన  చెప్పారు.బిజెపి ప్రభుత్వంలో కులమతాలను రెచ్చగొడుతూ ఒక నాలుగు కార్పొరేట్ కంపెనీలకు దోచిపెడుతుందని, ఆధాని అంబానీల చేతిలో ప్రభుత్వం నడిపించే రిమోట్ ఉందన్నారు. రాబోయే రోజుల్లో కేంద్రం లో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందని, పేద ప్రజలకు కావలసింది చేస్తుందన్నారు. పార్టీని అట్టడుగు స్థాయి నుండి పునర్ నిర్మిస్తున్నామన్నారు. పట్టణం, జిల్లాలోని ప్రతి నియోజకవర్గము తాలూకా, మునిసిపాలిటీ మరియు మునిసిపల్  వార్డులను సందర్శించి, అట్టడుగు స్థాయి కార్యకర్తలతో సంప్రదించి, కొత్త స్థానిక నాయకులను నియమిస్తారన్నారు. యువకులు, విద్యావంతులు,సైద్ధాంతిక నిబద్ధత కలిగిన వ్యక్తులకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంధన్నారు.ప్రతి ఒక్కరి అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకుంటాం మా పర్యటన తర్వాత,  నియామకాలను ఖరారు చేయడానికి జాతీయ మరియు రాష్ట్ర నాయకత్వానికి నివేదికలు సమర్పించబడతాయి. రాజ్యాంగ విలువలు, రాజ్యాంగాన్ని కాపాడే ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ అని అన్నారు


Image 1

శాంతియుత వాతావరణంలో పండగలు జరుపుకోవాలి : డిఎస్పీ అరుణ్ కుమార్

Posted On 2026-05-07 22:23:39

Readmore >
Image 1

పట్టుదల,క్రమశిక్షణ కలిగి ఉంటే ఉన్నత శిఖరాలను సులభంగా అధిగమించవచ్చు

Posted On 2026-05-07 22:08:07

Readmore >
Image 1

మూగ జీవాల స్మగ్లర్ల అరెస్టులో ప్రతిభ కనబరిచిన ఖానాపూర్ ఎస్సైకి పురస్కారం

Posted On 2026-05-07 20:29:13

Readmore >
Image 1

జిల్లా ప్లినరి కి ముఖ్య అతిథులుగా హాజరై న Mlc ప్రొఫెసర్ కోదండరాం

Posted On 2026-05-07 20:07:14

Readmore >
Image 1

పోక్సో కేసులో నిందితుడికి 20 సంవత్సరాల జైలు శిక్ష

Posted On 2026-05-07 19:59:26

Readmore >
Image 1

"ఒత్తిడిని జయించేద్దామా" (మీ కోసమే మేమున్నాం..)

Posted On 2026-05-07 19:55:06

Readmore >
Image 1

మే 9న కరీంనగర్ బంద్‌కు బీఆర్ఎస్ పిలుపు

Posted On 2026-05-07 18:18:48

Readmore >
Image 1

టిఆర్ఎస్ మున్సిపల్ కోఆప్షన్ గా కుంభాల రవి యాదవ్

Posted On 2026-05-07 18:13:44

Readmore >
Image 1

నేడు రాష్ట్రంలోని ఈ జిల్లాల్లో వర్షాలు....

Posted On 2026-05-07 13:26:51

Readmore >
Image 1

ఏసీబీ వలలో అటవీ శాఖ అధికారులు

Posted On 2026-05-07 13:25:33

Readmore >