Posted on 2025-10-13 19:37:00
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: సింగరేణి కొత్తగూడెం ఏరియాలో రోజురోజుకు కార్మిక కుటుంబాలపై కోతుల దాడులు ఎక్కువవుతున్న క్రమంలో కోతుల దాడి నుండి రక్షించాలని స్థానిక నాయకులు మందుల. జయరాజు గారి ఆధ్వర్యంలో ఏరియా జిఎం శాలెం రాజు గారిని కలిసి మెమొరండం అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా మాల మహానాడు జిల్లా అధ్యక్షులు పూల.రవీందర్ మాట్లాడుతూ సింగరేణి కొత్తగూడెం ఏరియాలో కార్మిక కుటుంబాల పిల్లలు మరియు మహిళలపై కోతులు పైశాచికంగా దాడులు చేసి గాయపరుస్తున్నాయని, మహిళలు మరియు స్కూలుకు వెళ్లే పిల్లలు తీవ్ర ఇబ్బందులకు మరియు భయభ్రాంతులకు గురవుతున్నారు.దీనివలన కార్మికులు డ్యూటీలకు వెళ్లిన సమయంలో ఇంట్లో వారి కుటుంబ సభ్యులకు భద్రత లేని కారణంగా డ్యూటీలు చేస్తున్న కార్మికులు సైతం వారి డ్యూటీలు సరిగా చేయలేరని, వారు డ్యూటీలో ఉన్నా కూడా ఇంట్లో వాళ్లపై కోతులు దాడి చేస్తాయేమో అని భయంతో డ్యూటీలు చేస్తున్నారని, వారి మనసును పనిమీద నిమగ్నం చేయలేరని తద్వారా సింగరేణి సంస్థకు కూడా నష్టం జరిగే అవకాశం ఉన్నది కావున తక్షణమే స్పందించి కార్మిక కుటుంబాలకు కోతుల బెడద నుండి దాడుల నుండి రక్షణ కల్పించే చర్యలలో భాగంగా కోతులను వెంటనే పట్టించి వాటిని ఊరికి దూరంగా అడవులలో వదిలేయాలని సింగరేణి వారికి తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు మందుల. జయరాజు, గుత్తుల.దుర్గాప్రసాద్ భూక్య. రవి, మారేపల్లి. వెంకటేశ్వర్లు తదితర నాయకులు పాల్గొన్నారు.
కామారెడ్డి జిల్లాలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని పరిశీలించిన రాష్ట్ర ప్రత్యేక అధికారి డా. వెంకటరమణ
Posted On 2026-06-28 19:08:04
Readmore >
దివ్యాంగులకు జాలి కాదు... సమాన అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం : మంత్రి సీతక్క
Posted On 2026-06-28 07:18:46
Readmore >
సమయస్ఫూర్తితో బాలికను రక్షించిన దంపతులకు సీపీ సజ్జనర్ సత్కారం
Posted On 2026-06-27 20:20:48
Readmore >
ఆస్ట్రేలియా పర్యటన ముగించుకొని ఇండియాకు విచ్చేసిన సహ చట్టం రాష్ట్ర డైరెక్టర్ సలీం కు సన్మానం
Posted On 2026-06-27 19:06:37
Readmore >
ఆర్‌జీయూకేటీ బాసర్ విద్యార్థినికి రూ.10,000 ఆర్థిక సహాయం అందజేసిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, SP రాజేష్ చంద్ర
Posted On 2026-06-27 19:05:50
Readmore >