డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: ప్రముఖ సర్వేయర్ తిరుమల శెట్టి (సర్వే) వెంకటేశ్వరరావు ఇటీవల మరణించారు.పాల్వంచ మునిసిపాలిటీ పరిధిలోని కాంట్రాక్టర్స్ కాలనీలో సోమవారం ఆయన దశదినకర్మల సందర్భంగా రాష్ట్ర మార్క్ ఫెడ్ మాజీ డైరెక్టర్,డి సి ఎం ఎస్ మాజీ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు పాల్గొని సర్వేయర్ కుమారుడు రవిశ్రీ తో పాటు కుటుంబ సభ్యులను పరామర్శించి, సంతాపం,ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు కొండం వెంకన్న సకినాల రాము తదితరులు పాల్గొన్నారు.
తర్వాత పాల్వంచ మండలం పరిధిలోని జగన్నాధపురం గ్రామంలో మంద సత్యనారాయణ మనమడు చిరంజీవి సుశాంత్(4సం//) అనారోగ్యంతో మరణించాడు.వారి కుటుంబానికి డిసిఎంఎస్ మాజీ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు ప్రగాఢ సానుభూతి సంతాపం తెలిపారు.
ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు కొండం వెంకన్న గౌడ్,దంతోజు కామాచారి,బాలాజీ నాయక్,జలగం వెంకటేశ్వర్లు,వీసం కృష్ణ ప్రసాద్,పాటి ధనమూర్తి,గాలం వెంకన్న,బానోతు లక్ష్మణ్,కాట్రేగుల నరసింహారావు,కొమరయ్య తదితరులు పాల్గొన్నారు.