Posted on 2025-10-12 22:54:50
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: బీసీలకు స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు తక్షణం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ, జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో అక్టోబర్ 14వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా బంద్ నిర్వహించబడనుంది.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఈ బంద్‌ను సంపూర్ణంగా జయప్రదం చేయాలని జిల్లా నాయకులు పిలుపునిచ్చారు.
నేతలు తెలిపారు — రాష్ట్ర జనాభాలో బీసీలు సగానికి పైగా ఉన్నప్పటికీ, రాజకీయ, విద్యా, ఉద్యోగ రంగాల్లో వారికీ సరైన ప్రతినిధిత్వం లేకపోవడం విచారకరం. ప్రభుత్వాలు బీసీల వాస్తవ స్థితిని గుర్తించకుండా నిర్లక్ష్యం వహిస్తున్నాయని పేర్కొన్నారు.
ఇక మౌనం సరి కాదు. బీసీల హక్కుల కోసం, సామాజిక న్యాయం కోసం అందరం ఒక్కటిగా నిలబడి, అక్టోబర్ 14న జరిగే బంద్ విజయవంతం చేయాలి. ఇది బీసీల గౌరవం కోసం జరగబోయే ఉద్యమం” అని నేతలు పిలుపునిచ్చారు.సంఘం నాయకులు విద్యార్థులు, వ్యాపారవేత్తలు, ఉద్యోగులు, ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు, ఎస్సీ–ఎస్టీ నాయకులు అందరూ బంద్‌లో చురుకుగా పాల్గొని తమ మద్దతు తెలపాలని విజ్ఞప్తి చేశారు.బీసీల ఆర్థిక, విద్యా, రాజకీయ స్థితి క్షీణిస్తోంది. ప్రభుత్వ పథకాల నుండి బీసీలు పక్కనపడుతున్నారు. ఈ బంద్ ద్వారా ప్రభుత్వం కళ్ళు తెరచి చట్టబద్ధమైన రిజర్వేషన్లు అమలు చేయాలి” అని అన్నారు.
కొదుమూరి సత్యనారాయణ – రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
కురిమెల్ల శంకర్ – జిల్లా అధ్యక్షుడు
భూపతి శ్రీనివాసరావు – జిల్లా ప్రధాన కార్యదర్శి
బండి రాజ్ గౌడ్ – జిల్లా ఉపాధ్యక్షుడు
పితాని సత్యనారాయణ – జిల్లా గౌరవ అధ్యక్షుడు
రాజేశ్వరి రాష్ట్ర సంఘం మహిళా నాయకురాలు
కొంపల్లి మునీల – జిల్లా మహిళా అధ్యక్షురాలు
మల్లెల ఉషారాణి – గౌరవ సలహాదారుబీసీల హక్కుల కోసం – సామాజిక న్యాయం కోసం – అక్టోబర్ 14 బంద్‌ను విజయవంతం చేద్దాం!”
దివ్యాంగులకు జాలి కాదు... సమాన అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం : మంత్రి సీతక్క
Posted On 2026-06-28 07:18:46
Readmore >
సమయస్ఫూర్తితో బాలికను రక్షించిన దంపతులకు సీపీ సజ్జనర్ సత్కారం
Posted On 2026-06-27 20:20:48
Readmore >
ఆస్ట్రేలియా పర్యటన ముగించుకొని ఇండియాకు విచ్చేసిన సహ చట్టం రాష్ట్ర డైరెక్టర్ సలీం కు సన్మానం
Posted On 2026-06-27 19:06:37
Readmore >
ఆర్‌జీయూకేటీ బాసర్ విద్యార్థినికి రూ.10,000 ఆర్థిక సహాయం అందజేసిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, SP రాజేష్ చంద్ర
Posted On 2026-06-27 19:05:50
Readmore >
ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన ప్రతి హామీని ప్రభుత్వం అమలు చేస్తుంది : రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్
Posted On 2026-06-27 10:56:55
Readmore >