Posted on 2024-01-03 14:17:52
"బందు" పడుతున్న సాంచలు
ఉపాధి కోల్పోతున్న కార్మికులు
ఇప్పటికే సగం మంది పవర్లూమ్ అనుబందరంగా కార్మికులు ఉపాధి కోల్పోయారు
వెంటనే ప్రభుత్వ వస్త్రాల ఆర్డర్లు ఇచ్చి ఉపాధి చర్యలు తీసుకోవాలి
పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు
ముశం రమేష్
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: ఈరోజు బి వై నగర్ సిఐటియు కార్యాలయంలో పవర్లూమ్ అనుబంధ రంగాల సమావేశం సిరిమల్లె సత్యం అధ్యక్షతన జరిగింది ఈ సందర్భంగా పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు. ముశం రమేష్ మాట్లాడుతూ గత టిఆర్ఎస్ ప్రభుత్వం సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ గురించి తీసుకున్న సరియైన నిర్ణయాలు తీసుకోకపోవడం మూలంగా ఈరోజు వస్త్ర పరిశ్రమ పెద్ద ఎత్తున సంక్షోభంలో కూరుకపోయింది గతంలో సిరిసిల్లలో ఉత్పత్తి అయినటువంటి పాలిస్టర్ కాటన్ ఇతర రకాల వస్త్రాలను బతుకమ్మల చీరల ఉత్పత్తి సందర్భంగా మొత్తం బంద్ చేయించి బతుకమ్మ చీరలు ఉత్పత్తి చేయించడం వలన ప్రైవేట్ వస్త్రపరిశ్రమమార్కెట్ మొత్తం సిరిసిల్లతో సంబంధాలు తెగిపోయినాయి ఫలితంగా ఇప్పుడు ప్రభుత్వం మారడంతో ప్రభుత్వ వస్త్రాల ఆర్డర్లపై ఆధారపడి వ్యాపారం చేస్తున్న యజమానులు పాలిస్టర్ వస్త్రాన్ని ఉత్పత్తి చేసి అమ్ముదామంటే మార్కెట్ లేక మొత్తం బంద్ చేయడం జరుగుతుంది ఇప్పటికే టెక్స్టైల్ పార్క్ బంద్ ప్రకటించడం జరిగింది సిరిసిల్లలో కూడా సగం సంచాలు బీములు కొములు లేక బందుపడ్డాయి దాదాపు 5,000 మంది కార్మికులు ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి కోల్పోయారు ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే ఇంకో నెల వరకు సిరిసిల్ల మొత్తం బంద్ పడే పరిస్థితి ఏర్పడుతుంది ఎలక్షన్లకు ముందే మాజీ మంత్రి స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ గారు ఆయనతో అయ్యే కొన్ని పనులు కావాలనిచెయ్యకపోవడం వలన సమస్య తయారయింది
1 కార్మికులకు వర్కర్ టు ఓనర్ పూర్తి చేయకపోవడం 2.బతుకమ్మ చీరలకు సంబంధించి జీవో చేయించకపోవడం
3.ప్రభుత్వ వస్త్రాలకు సంబంధించిన బకాయిలు మొత్తం విడుదల చేయించకపోవడం
4.కార్మికుల సబ్సిడీ మొత్తం విడుదల చేయించకపోవడం .
5.కరెంటు సమస్య పరిష్కారం చేయకపోవడం
ఈ సమస్యలన్నీ పరిష్కారం చేసి ఉంటే సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు ఇంత ఇబ్బంది సంక్షోభం రాక పోయేది
గత ప్రభుత్వంలో ప్రభుత్వ వస్త్రాలకు సంబంధించి యజమానులకు రావలసిన బకాయి డబ్బులు విడుదల చేసినా కూడా కొంత పరిశ్రమ నడిచే అవకాశం ఉండేది గత ప్రభుత్వం విధానాల వల్ల సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ లోని కార్మికులు ఆసాములు అనుబంధ రంగాల కార్మికులు ఉపాధి కోల్పోయే పరిస్థితి ఏర్పడింది పరిస్థితి ఇంకా తీవ్ర రూపం కాకముందే కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకునే విధంగా వేములవాడ ఎమ్మెల్యే గారు శ్రీనివాస్ గారు సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి కేకే మహేందర్ రెడ్డి వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి ప్రభుత్వానికి అవసరమయ్యే వస్త్రాలను ఉత్పత్తి చేయించే విధంగా కృషి చేయాలని అన్నారు.
ఈ సమావేశంలో యూనియన్ జిల్లా అధ్యక్షులు కోడం రమణ వార్పిన్ అధ్యక్షులు సిరిమల్లె సత్యం, మచ్చ వేణు వైపని నాయకులు ఒగ్గు గణేష్ ఆడే సంపత్ జాఫర్ యూనియన్ అధ్యక్షులు శ్రీనివాస్ కార్యదర్శి శశి కుమార్ పవర్లూమ్ నాయకులు బెజిగం సురేష్. కంది మల్లేశం బింగి సంపత్ సంతు పట్ల పోచమ్మ తదితరులు పాల్గొన్నారు
రాజ్‌భవన్‌లో స్వాతంత్ర్య వేడుకలకు జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుడికి అరుదైన ఆహ్వానం
Posted On 2026-08-15 18:03:53
Readmore >
16 సంవత్సరాల సేవా ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న KRK Sunshine Charitable Trust
Posted On 2026-08-15 17:50:48
Readmore >
గ్రామీణ విద్యలో మార్పు... సాంకేత్ సంస్థ ద్వారా సోమారం స్కూల్‌కు డిజిటల్ పరికరాలు
Posted On 2026-08-15 17:49:14
Readmore >
విద్యుత్ షాక్ తో మరణించిన ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ మృతికి కారణమైన నిందితులను అరెస్టు చేసిన బూర్గంపాడు పోలీసులు
Posted On 2026-08-15 16:55:47
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లా : జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
Posted On 2026-08-15 13:43:20
Readmore >
వెంకట సాయి నగర్ కాలనీలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
Posted On 2026-08-15 07:51:52
Readmore >