డైలీ భారత్, జూలూరుపాడు: మండలంలోని సాయి ఎక్సెలెంట్ పాఠశాల ఆధ్వర్యంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ శారదా దేవి మాట్లాడుతూ స్వాతంత్ర్య దినోత్సవం ఎంతోమంది వీరులు తమ ప్రాణాలను పణంగా పెట్టి స్వాతంత్రం సాధించడం జరిగిందన్నారు. స్వాతంత్రం సాధించిన అమరవీరులకు నివాళులర్పించి, స్వాతంత్రం యొక్క విశిష్టతను వివరించారు. అదే విధంగా విద్యార్థులు క్రమశిక్షణతో విద్యను అభ్యసిస్తూ వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని ఆకాంక్షించారు. ఆదాయ సంపాదన కోసం కార్పొరేట్ పాఠశాలను నెలకొల్పుతున్న ఈ రోజుల్లో పేద, మధ్యతరగతి విద్యార్థులకు సాయి ఎక్సలెంట్ పాఠశాలలో నాణ్యమైన విద్యను అందించడం జరుగుతుందన్నారు. అదేవిదంగా గత ఏడాది విద్యా సంవత్సరంలో సాయి ఎక్సలెంట్ పాఠశాలలో 10 నవోదయ సీట్లు, 70 గురుకుల సీట్లు సాధించడం కూడా చాలా సంతోషమన్నారు. ప్రస్తుతం మా యొక్క పాఠశాలలో గురుకుల, నవోదయ, ఏకలవ్య, సైనిక్ కోచింగ్ ఇవ్వడం జరుగుతుందని, ఈ అవకాశాన్ని కూడా విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. పల్లె, పల్లెకు కార్పొరేట్ స్థాయి విద్యను అందించాలనే సదుద్దేశంతో 2026 -2027 విద్యా సంవత్సరానికి ముందుకు అడుగులు వేసేదానిలో భాగంగా డిజిటల్ క్లాసులను కార్పొరేట్ లీడ్ అనే సంస్థ తో ఒప్పందం చేసుకొని నాణ్యమైన విద్యను అందించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. విద్యార్థులు పాటలు పాడుతూ నృత్యాలు చేస్తూ అలరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్లు ఆరెబోయిన హుస్సేన్, జక్కుల శివకుమారి, ఆరెబోయిన నాగలక్ష్మి, ప్రిన్సిపాల్ నాగరాజు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
News
సాయి ఎక్సలెంట్ పాఠశాలలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు