Posted on 2026-08-15 16:55:47
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం నకిరేపేట అటవీ ప్రాంతంలో కొంతమంది వ్యక్తులు అక్రమంగా అడవి జంతువులను విద్యుత్ షాక్ తో చంపడానికి వైర్లను అమర్చినారని సమాచారం రాగా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ బానోతు నవీన్ మరియు తన డి ఆర్ వో తోటి సిబ్బందితో కలిసి ప్రదేశానికి వెళ్లి, అట్టి వ్యక్తుల గురించి వెతుకుతుండగా అట్టి విద్యుత్ వైర్ తగిలి షాక్ తో నవీన్ మృతి చెందగా, డిఆర్ఓ అనార్కలి గారి ఫిర్యాదు మేరకు ఇట్టి నవీన్ మృతికి కారకులైన ఆవుల నాగిరెడ్డి, దాసరి నరేష్, తాటి వీరబాబు లపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించడం జరిగింది.
అటవీ జంతువులను వేటాడటానికి అక్రమంగా విద్యుత్ తీగలను అమర్చిన నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టగా ఈ రోజు లక్ష్మిపురం గ్రామంలోని ఆవుల నాగిరెడ్డి ఇంట్లో అతనితో పాటు దాసరి నరేష్,తాటి వీరబాబు లను ఉన్నారనే సమాచారంతో పోలీసులు వెళ్ళగా పారిపోతున్న అట్టి ముగ్గురిని పట్టుకోవడం జరిగింది.పట్టుకున్న ముగ్గురు వ్యక్తులు ఇచ్చిన సమాచారం మేరకు నాలుగో నిందితుడైన కన్నదారి అనంతయ్యను నాగినేనిప్రోలు రెడ్డిపాలెంలోని అతని ఇంటి వద్ద అరెస్టు చేయడం జరిగింది.
నిందితుల వివరాలు
ఆవుల నాగిరెడ్డి,దాసరి నరేష్,కన్నెదారి అనంతయ్య, పట్టుబడిన ఈ నలుగురు నిందితుల వద్ద నుండి బైండింగ్ వైరు,కర్రలను పాతడానికి ఉపయోగించిన గడ్డపలుగు, ఖాళీ క్వార్టర్ సీసాలను స్వాధీనం చేసుకోవడం జరిగింది.
ఎవరైనా అటవీ జంతువులను వేటాడటానికి అక్రమంగా విద్యుత్ తీగలను అమర్చి అమాయక జంతువుల ప్రాణాలు మరియు ఈ విధంగా అధికారుల ప్రాణాలను పోవడానికి కారణమైతే చట్ట పరంగా కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది.పట్టుబడిన ఇట్టి నలుగురు నిందితులను జ్యూడిషియల్ రిమాండ్ నిమిత్తం కోర్టునకు తరలించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో పాల్వంచ సర్కిల్ ఇన్స్పెక్టర్ సతీష్ బూర్గంపాడు ఎస్సైలు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు
విద్యుత్ షాక్ తో మరణించిన ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ మృతికి కారణమైన నిందితులను అరెస్టు చేసిన బూర్గంపాడు పోలీసులు
Posted On 2026-08-15 16:55:47
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లా : జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
Posted On 2026-08-15 13:43:20
Readmore >
వెంకట సాయి నగర్ కాలనీలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
Posted On 2026-08-15 07:51:52
Readmore >
ఆటో కార్మికులతో కలిసి స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న బిజెపి నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-08-15 07:33:17
Readmore >
"బెస్ట్ సైకాలజిస్ట్ ఆఫ్ ది ఇయర్ అవార్డు అందుకున్న పున్నంచందర్"
Posted On 2026-08-14 18:18:19
Readmore >