| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

గ్రామీణ విద్యలో మార్పు... సాంకేత్ సంస్థ ద్వారా సోమారం స్కూల్‌కు డిజిటల్ పరికరాలు

గ్రామీణ విద్యలో మార్పు... సాంకేత్ సంస్థ ద్వారా సోమారం స్కూల్‌కు డిజిటల్ పరికరాలు

డైలీ భారత్, కామారెడ్డి జిల్లా, తాడ్వాయి: గ్రామీణ ప్రాంత విద్యార్థుల్లో డిజిటల్ అక్షరాస్యతను పెంచేందుకు తాడ్వాయి మండలం సోమారం గ్రామ ప్రభుత్వ పాఠశాలకు డిజిటల్ సామాగ్రిని అందజేశారు.

గ్రామానికి చెందిన కమిశెట్టి సంతోష్ చొరవతో హైదరాబాద్‌కు చెందిన సాంకేత్ స్వచ్ఛంద సంస్థ ముందుకు వచ్చింది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఈరోజు సంస్థ ఫౌండర్ మురళి ఫణి కుమార్, ప్రెసిడెంట్ మత మరియు వారి టీం సోమారం గ్రామాన్ని సందర్శించారు.

ఈ సందర్భంగా పాఠశాలకు ₹53,000 విలువైన ప్రోజెక్టర్ మరియు స్క్రీన్ ను అందజేశారు. దీనితో విద్యార్థులు ఇకపై వీడియోలు, డిజిటల్ కంటెంట్ ద్వారా చదువుకోవచ్చు. అదేవిధంగా గ్రామంలోని 2 అంగన్వాడీ కేంద్రాలకు ఫ్యాన్లు మరియు విద్యా సామాగ్రి ని కూడా పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో సర్పంచ్ వినోదమ్మ, ఉప సర్పంచ్ కాట్రోత్ రమేష్, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రవికాంత్, ఉపాధ్యాయులు, గ్రామస్థులు మరియు విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

కమిశెట్టి సంతోష్ మాట్లాడుతూ "మన గ్రామ పిల్లలు కూడా నగర పిల్లల్లాగా డిజిటల్ విద్య అందుకోవాలి. అందుకే సాంకేత్ సంస్థను సంప్రదించాను" అని అన్నారు.

సంస్థ ప్రతినిధులు మాట్లాడుతూ భవిష్యత్తులో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలను కొనసాగిస్తామని హామీ ఇచ్చారు.

గ్రామస్థులు ఈ సహాయానికి హర్షం వ్యక్తం చేశారు.

 #Kamareddy #Somaram #DigitalEducation #SankethNGO #TelanganaNews

Previous సాయి ఎక్సలెంట్ పాఠశాలలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
Next 16 సంవత్సరాల సేవా ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న KRK Sunshine Charitable Trust
ADVERTISEMENT