డైలీ భారత్, సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్ కార్యాలయంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే జాతీయ జెండాను ఎగురవేసి పోలీస్ అధికారులకు, సిబ్బందికి, ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలను సైతం త్యాగం చేసిన స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని,వారి త్యాగాల స్ఫూర్తితో దేశ సమగ్రత, ఐక్యతతో పాటు శాంతి భద్రతలను పరిరక్షించడంలో పోలీస్ శాఖ కీలక పాత్ర పోషిస్తుందని జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే గారు తెలిపారు. శాంతిభద్రతల పరిరక్షణ, ప్రజల భద్రత, చట్టబద్ధ పాలనతో పాటు ప్రజలకు స్నేహపూర్వకమైన, పారదర్శకమైన, సాంకేతికత ఆధారిత పోలీసింగ్ సేవలను అందించడమే ప్రతి పోలీస్ అధికారి పని చేయాలని అధికారులకు సూచించారు.
ఈకార్యక్రమంలో డిఎస్పీ లు నాగేంద్రచారి, శ్రీనివాసులు, వెంకటేశ్వర్లు, సి.ఐ లు, ఆర్.ఐ లు, ఏ. ఓ, ఎస్.ఐ లు కార్యాలయ సిబ్బంది, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.