| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ సంబరాలు

ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ సంబరాలు

త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించిన తెలంగాణ రాష్ట్ర వెనుకబడిన తరగతుల సంక్షేమ & అభివృద్ధి సలహాదారులు వి. హనుమంతరావు

ఆకట్టుకున్న సాంస్కృతిక ప్రదర్శనలు

డైలీ భారత్, కామారెడ్డి : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని  ఇందిరాగాంధీ స్టేడియంలో శనివారం 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు పండుగ వాతావరణంలో అట్టహాసంగా జరిగాయి.  

ఈ వేడుకలకు జిల్లా యంత్రాంగం విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేసింది. ముఖ్య అతిథిగా

రాష్ట్ర  వి. హనుమంతరావు విచ్చేసి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.

 పోలీసుల నుండి గౌరవ వందనం స్వీకరించిన మీదట, పుర ప్రముఖులను, అధికార అనధికారులను కలిసి స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. జిల్లా ప్రగతిని నివేదిస్తూ, ప్రజనుద్దేశించి ప్రసంగించారు. వివిధ శాఖల ద్వారా అమలవుతున్న కార్యక్రమాలు, సాధించిన ప్రగతిని తెలిపేలా ఏర్పాటు చేసిన స్టాళ్లను సందర్శించారు. వ్యవసాయ, ఉద్యానవన, జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ, పశు సంవర్ధక, అటవీ, విద్యా, వైద్యారోగ్య, మహిళా శిశు సంక్షేమం, మిషన్ భగీరథ, నీటి పారుదల, సమగ్ర శిక్ష అభియాన్ తదితర శాఖల ఫోటో ఎగ్జిబిషన్ స్టాల్స్ ను సందర్శించారు. .  ఉత్తమ సేవలు అందించిన ఉద్యోగులకు ప్రశంసాపత్రాలు బహూకరించారు. పతకాలు పొందిన పోలీసులకు మెడల్స్ బహూకరించారు. స్వాతంత్ర్య సమర యోధులను, వారి కుటుంబీకులను ఘనంగా సన్మానించారు. 

పంద్రాగస్టు వేడుక సందర్భంగా చిన్నారుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆహుతులను అలరింపజేశాయి. ఎదనిండా దేశ భక్తిని నింపుకుని జాతీయ స్ఫూర్తి పెంపొందేలా ఆకట్టుకునే రీతిలో సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించి ఆహుతుల మన్ననలు అందుకున్నారు. పాఠశాలల చిన్నారులు సాంస్కృతిక గేయాలపై చక్కటి అభినయం ప్రదర్శించారు. 

ఈ సందర్భంగా చిన్నారులను ముఖ్య అతిథి  వి. హనుమంతరావు ఇతర ప్రజాప్రతినిధులు, జిల్లా ఉన్నతాధికారులు ప్రత్యేకంగా అభినందించారు.

ఈ వేడుకల్లో జిల్లా కలెక్టర్  ఆశిష్ సాంగ్వాన్, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్ మదన్ మోహన్ రావు, జిల్లా గ్రంధాలయ శాఖ మధ్య చంద్రకాంత్ రెడ్డి. మున్సిపల్ చైర్ పర్సన్ ఇప్ప ఉమారాణి. జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర, అదనపు కలెక్టర్ విక్టర్. అదనపు స్థానిక సంస్థల కలెక్టర్ ఎన్ వై గిరి,డి ఆర్ వో పాండు.  ప్రజా ప్రతినిధులు,అన్ని శాఖలకు చెందిన అధికారులు, సిబ్బంది, స్వాతంత్ర్య సమరయోధులు, ప్రజలు, విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.

Previous 16 సంవత్సరాల సేవా ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న KRK Sunshine Charitable Trust
Next రాజ్‌భవన్‌లో స్వాతంత్ర్య వేడుకలకు జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుడికి అరుదైన ఆహ్వానం
ADVERTISEMENT