Posted on 2025-10-10 18:03:39
జిల్లా పర్యటనకు వచ్చిన సీఎంకు వినతి పత్రం అందించిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా కేంద్రంలో రూరల్ ఎమ్మెల్యే మాతృమూర్తి ద్వాదశ దినకర్మ కార్యక్రమానికి హైదరాబాద్ నుండి హెలికాప్టర్ ద్వారా వచ్చిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కలెక్టరేట్ ప్రాంగణంలోని హెలిప్యాడ్ వద్ద నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా ముఖ్యమంత్రికి అర్బన్ నియోజకవర్గం అభివృద్ధికై నిధులు వెచ్చించాలని వినతిపత్రం అందించారు. జిల్లా కేంద్రంలో పేద విద్యార్థుల చదువు కోసం ఇంటిగ్రేటెడ్ స్కూలు త్వరగా ఏర్పాటు చేసి విద్యార్థులకు అందుబాటులో కి తీసుకురా వచ్చే విధంగా కృషి చేయాలని కోరారు. అలాగే నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధి కోసం వంద కోట్ల నిధులు మంజూరు చేయాలని ఆయన ముఖ్యమంత్రిని కోరారు. అలాగే నగర శివారులోని నాగారం లో ఉన్న డబుల్ బెడ్ రూమ్ లను అదేవిధంగా చంద్రశేఖర్ కాలనీ సమీపంలో ఉన్న అభయహస్తం కాలనీలో పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు నిర్మించి ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు అలాగే జిల్లా ప్రభుత్వ ఆసుపత్రులు అన్ని వస్తువులతో కూడిన పరికరాలు కార్పొరేట్ ఆసుపత్రులకు దీటుగా అన్ని డిపార్ట్మెంట్ లకు సంబంధించిన వైద్యులు జిల్లా ఆస్పత్రి లో ఉండే విధంగా తక్షణమే వైద్యులను నియమించాలని ఆయన కోరారు. అలాగే నిజామాబాద్ బస్టాండ్ ను ఆధునికరించేందుకు ప్రత్యేక నిధులు వెచ్చించి అందరికీ అన్ని వసతులతో కూడిన విధంగా ప్రత్యేక బస్టాండ్ ఏర్పాటు చేయాలని వినతి పత్రంలో సీఎంకు ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా విన్నవించారు.
2047 వరకు మూడు ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా మార్చడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుంది : సీఎం రేవంత్ రెడ్డి
Posted On 2025-12-08 19:32:03
Readmore >
మొదటి విడత గ్రామపంచాయతీ ఎన్నికల కోసం పటిష్టమైన బందోబస్తు చర్యలు
Posted On 2025-12-08 18:21:39
Readmore >
ఉర్దూ అకాడమీ చైర్మన్ కుమారుని రిసెప్షన్ వేడుకకు హాజరైన టిపిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్
Posted On 2025-12-08 13:06:39
Readmore >
నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే నిర్వహించిన అయ్యప్ప పడిపూజ కార్యక్రమంలో పాల్గొన్న పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్
Posted On 2025-12-08 13:05:41
Readmore >
డ్రంక్ అండ్ డ్రైవ్ పై పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్న మారని మందుబాబులు
Posted On 2025-12-07 19:45:50
Readmore >
చెప్పులు మెడలో వేసుకుని రాజీనామా చేస్తా : సర్పంచ్ అభ్యర్థిణి రాజేశ్వరి
Posted On 2025-12-07 18:39:01
Readmore >