| Daily భారత్
Logo




రామంతపూర్ ఏఈ మౌనికపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి : జర్నలిస్ట్ విజయేందర్ రెడ్డి

News

Posted on 2025-10-09 15:58:52

Share: Share


రామంతపూర్ ఏఈ మౌనికపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి : జర్నలిస్ట్ విజయేందర్ రెడ్డి

డైలీ భారత్, రామంతపూర్: రామంతపూర్ భగయత్ కాలనీ, వెంకట సాయి నగర్, సాయి కృష్ణ కాలనీలో బీరప్ప దేవాలయం వెనుక లైన్‌లో సాంక్షన్ అయిన బాక్స్ కల్వర్ట్ పనులు ఎందుకు ప్రారంభం కాలేదని జర్నలిస్ట్ విజయేందర్ రెడ్డి ప్రశ్నించగా, “బాక్స్ కల్వర్ట్ మరోచోట వేస్తాం” అని సర్కిల్-2 ఇంజనీరింగ్ విభాగం అధికారులు తెలిపారు.

దీంతో జర్నలిస్ట్ విజయేందర్ రెడ్డి వెంటనే జీహెచ్ఎంసి సర్కిల్-2 డిప్యూటీ కమిషనర్ రాజును కలిసి వివరాలు తెలియజేశారు. అనంతరం డిప్యూటీ కమిషనర్ ఇంజనీరింగ్ విభాగానికి చెందిన డిఈ నాగమణి, ఏఈ మౌనికను పిలిచి వివరణ కోరగా, ఆమె తప్పు సమాచారం ఇచ్చారు. “ఆ లొకేషన్‌లో కల్వర్ట్ సాంక్షన్ కాలేదు. టెక్నికల్ రిపోర్ట్ ప్రైవేట్ వ్యక్తులతో చేయించుకున్నారు. మేము ఎలాంటి రిపోర్ట్ ఇవ్వలేదు,” అని ఏఈ మౌనిక పేర్కొంది.

ఈ సందర్భంలో జర్నలిస్ట్ విజయేందర్ రెడ్డి తన మొబైల్‌ లో జీహెచ్ఎంసి డిప్యూటీ కమిషనర్‌కు  టెక్నికల్ రిపోర్ట్ చూపించారు. అదే సమయంలో  పై అధికారులకు ఎందుకు తప్పుడు సమాచారం ఇస్తున్నారు అని అడిగితే, ఏఈ మౌనిక “మీరు ఎవరు  నాను అడగడానికి? మా ఇష్టం వచ్చిన చోట మేము వేస్తాం. మాకు ఎక్కడ వేయాలో తెలుసు,” అంటూ పై అధికారుల సమక్షంలో అవమానకరంగా ప్రవర్తించింది.

జర్నలిస్ట్ విజయేందర్ రెడ్డి మనోభావాలను దెబ్బతీసే రీతిలో వ్యవహరించిన ఏఈ మౌనికపై క్రమశిక్షణ చర్యలు తీసుకొని, విధుల నుంచి తొలగించాలని ఆయన జీహెచ్ఎంసి డిప్యూటీ కమిషనర్‌కి వినతిపత్రం అందజేశారు. “ఒక బాధ్యత గల జర్నలిస్టుతో ఇలా మాట్లాడితే సాధారణ ప్రజల పరిస్థితి ఏమిటి?” అని ఆయన ప్రశ్నించారు.

త్వరలో ఈ అంశంపై రాష్ట్ర గవర్నర్, ముఖ్యమంత్రి, తెలంగాణ ప్రధాన కార్యదర్శి, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సెక్రటరీ, జీహెచ్ఎంసి కమిషనర్, జోనల్ కమిషనర్, లోకాయుక్త జడ్జి వద్ద ఫిర్యాదు చేయనున్నట్లు విజయేందర్ రెడ్డి తెలిపారు.

Image 1

మత్తు పదార్థాలు, గంజాయి, డ్రగ్స్ పదార్థాలకు తమ పిల్లలు బానిస కాకుండా తల్లిదండ్రులు ఓ కంట కనిపెట్టాలి

Posted On 2025-11-13 10:03:28

Readmore >
Image 1

టీఎన్జీవో ఉద్యోగుల సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభం

Posted On 2025-11-12 19:13:27

Readmore >
Image 1

జిల్లా కేంద్రంలో గురువారం జరిగే సుదర్శన్ రెడ్డి సన్మాన సభకు కాంగ్రెస్ కార్యకర్తలు తరలి రావాలి

Posted On 2025-11-12 19:12:07

Readmore >
Image 1

పాత కలెక్టరేట్ ప్రాంగణంలో ఘనంగా నవదుర్గ మాత ఆలయ 5వ వార్షికోత్సవ మహోత్సవం

Posted On 2025-11-12 19:10:42

Readmore >
Image 1

అధిక శబ్దం చేసే సైలెన్సర్లను రోడ్ రోలర్ తో తొక్కించిన పోలీసులు

Posted On 2025-11-12 19:09:07

Readmore >
Image 1

నిజంగా ఆ పెద్ద మనిషికి ప్రభుత్వ సలహాదారుడిగా సంతృప్తినిచ్చిందా..?

Posted On 2025-11-12 13:27:18

Readmore >
Image 1

సీఏ లో ఉత్తీర్ణత సాధించిన బొడ్డు సతీష్ ఆత్మీయ సత్కారం

Posted On 2025-11-12 08:51:49

Readmore >
Image 1

JNTUH -JAC చైర్మన్ & రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాల మహానాడు మంద రంజిత్ కుమార్ కి డాక్టరేట్ డిగ్రీ ప్రదానం

Posted On 2025-11-12 08:50:16

Readmore >
Image 1

బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడిగా చాపలమడుగు రామ్మూర్తి

Posted On 2025-11-12 08:48:19

Readmore >
Image 1

ప్రభుత్వ నిషేదిత గంజాయి వంటి మత్తు పదార్ధాలను రవాణా చేసే వ్యక్తుల సమాచారం అందించండి : జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్

Posted On 2025-11-12 08:47:02

Readmore >