Posted on 2025-10-09 15:43:47
డైలీ భారత్, ఫరూఖాబాద్: విజయవంతంగా టేకాఫ్ అయిన విమానం.. గాలిలో చక్కర్లు కొట్టకుండా.. చెట్ల పొదల్లో కుప్పకూలిపోయింది. ఈ షాకింగ్ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఫరూఖాబాద్ జిల్లాలో ఈ రోజు మధ్యాహ్నం చోటు చేసుకుంది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఒక ప్రైవేట్ జెట్ టేకాఫ్ అయిన కొద్దిసేపటికే సాంకేతిక లోపం కారణంగా కుప్పకూలింది. అదృష్టవశాత్తూ పైలట్లు, ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. ప్రైవేట్ జెట్ రన్‌వే నుండి టేకాఫ్ అయిన కొన్ని సెకన్లలోనే బ్యాలెన్స్ కోల్పోయి రన్‌వే పక్కన ఉన్న చెట్లపైకి దూసుకెళ్లింది.
విమానం భాగాలు చెట్లలో చిక్కుకుపోవడంతో పెద్ద ప్రమాదం తప్పిందని స్థానిక అధికారులు తెలిపారు. వెంటనే స్థానిక పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకొని రక్షణ చర్యలు చేపట్టారు. ప్రాథమిక సమాచారం ప్రకారం, జెట్‌లో ఇద్దరు పైలట్లు, ఇద్దరు ప్రయాణికులు ఉన్నట్లు తెలిసింది. వారందరినీ సురక్షితంగా బయటకు తీసుకువచ్చి వైద్య పరీక్షలు నిర్వహించారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు కొనసాగుతోంది. విమానయాన శాఖ (DGCA) ఈ ఘటనపై వివరాలు సేకరిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
చెప్పులు మెడలో వేసుకుని రాజీనామా చేస్తా : సర్పంచ్ అభ్యర్థిణి రాజేశ్వరి
Posted On 2025-12-07 18:39:01
Readmore >
పద్మశాలి విద్యార్థులు ఉన్నత విద్యలో ముందంజలో ఉండేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు
Posted On 2025-12-07 17:30:34
Readmore >
కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి తెలంగాణ గురించి మాట్లాడే అర్హత లేదు
Posted On 2025-12-07 14:24:59
Readmore >
హోంగార్డ్స్ 63 వ రైసింగ్ డే కార్యక్రమంలో పాల్గొన సిపి సాయి చైతన్య
Posted On 2025-12-06 16:17:59
Readmore >
కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 69వ వర్ధంతి వేడుకలు
Posted On 2025-12-06 16:16:40
Readmore >