| Daily భారత్
Logo




"మహిళలు మానసిక ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలి" : సైకాలజిస్ట్ కె. పున్నంచందర్

News

Posted on 2025-10-09 12:11:41

Share: Share


"మహిళలు మానసిక ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలి" : సైకాలజిస్ట్ కె. పున్నంచందర్

-మహిళల మానసిక ఆరోగ్య సదస్సులో సైకాలజిస్ట్ కె. పున్నంచందర్ పిలుపు.

డైలీ భారత్, సిరిసిల్ల: మానసిక ఆరోగ్య దినోత్సవంను  పురస్కరించుకొని మైండ్ కేర్ అండ్ కౌన్సిలింగ్ సెంటర్ ప్రభుత్వ సాధారణ వైద్యశాల ఆధ్వర్యంలో ఈరోజు సుందరయ్య నగర్ లోని మహిళలకు మానసిక ఆరోగ్యంపై అవగాహన కార్యక్రమాన్ని ప్రముఖ సైకాలజిస్ట్ కె. పున్నం చందర్ ఏర్పాటు చేసి మాట్లాడినారు.

ఈ సందర్భంగా సైకాలజిస్ట్ పున్నంచందర్ మాటడుతూ మహిళలు మానసిక ఆరోగ్యానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు.

ఇటీవలి కాలంలో మహిళలు కుటుంబం, ఉద్యోగం, సామాజిక బాధ్యతలు, మరియు వ్యక్తిగత జీవితం మధ్య సమతౌల్యం సాధించడంలో అత్యధిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నారని అన్నారు. 

ఈ ఒత్తిడి ఫలితంగా ఆందోళన, నిరాశ, నిద్రలేమి, కోపం, మరియు శారీరక అనారోగ్యాలు ఏర్పడుతున్నాయని అన్నారు.

మహిళలు తమ కుటుంబ అవసరాలనే కాకుండా, తమ వ్యక్తిగత మానసిక ఆరోగ్యాన్ని కూడా సమానంగా సంరక్షించు కోవడానికి  ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు.

ఒక సంతోషకరమైన తల్లి, భార్య, ఉద్యోగిని కావాలంటే, ముందు మనసు ప్రశాంతంగా ఉండాలని అన్నారు.

మానసిక ఆరోగ్యం కోసం మహిళలు ప్రతిరోజూ స్వీయ సంరక్షణ, మంచి అలవాట్లు అవలంబించాలని తెలిపారు.

సరైన నిద్ర, ఆరోగ్యకరమైన ఆహారం, వ్యాయామం, యోగా స్నేహితులతో సంభాషణ, అవసరమైతే సైకాలజిస్టు  సహాయం పొందడం లాంటివి చేయాలని అన్నారు.

ఆరోగ్యకరమైన మనస్సే నిజమైన ఆనందాన్ని ఇస్తుందని తెలిపారు.


ఈ కార్యక్రమంలో మైండ్ కేర్ అండ్ కౌన్సిలింగ్ సెంటర్ సిబ్బంది రాపేల్లి లత, బూర శ్రీమతి, కొండ ఉమ, మహిళలు పాల్గొన్నారు.

Image 1

పిల్లల ఆన్‌లైన్ గేమింగ్.. తల్లిదండ్రుల అజాగ్రత్తతో ఆర్థిక నష్టం

Posted On 2026-06-25 12:51:14

Readmore >
Image 1

పెళ్లి పేరుతో ప్రేమ, నగదు, బంగారం కాజేత

Posted On 2026-06-25 12:45:33

Readmore >
Image 1

"డ్రగ్స్ ఫ్రీ సిరిసిల్ల కోసం యువత ముందుకు రావాలి"

Posted On 2026-06-25 12:30:42

Readmore >
Image 1

మాసబ్ ట్యాంక్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో "సే నో టు డ్రగ్స్" అవగాహన సదస్సు

Posted On 2026-06-25 12:21:26

Readmore >
Image 1

చర్ల మండలంలో ఎన్సీపీ పార్టీలో 100 మంది యువకుల చేరిక

Posted On 2026-06-24 21:32:58

Readmore >
Image 1

ఐటీసీ కార్మికుల కు డ్రగ్స్ పై అవగాహనా కార్యక్రమం నిర్వహించిన బూర్గంపాడు ఎస్ఐ మెడ ప్రసాద్

Posted On 2026-06-24 21:31:42

Readmore >
Image 1

ఫ్యాన్ కు ఉరివేసుకొని మహిళా ఆత్మహత్య

Posted On 2026-06-24 19:18:46

Readmore >
Image 1

నకిలీ విత్తనాలు, ఎరువులు విక్రయిస్తే కఠిన చర్యలు : జూలూరుపాడు ఎస్‌ఐ జీనత్ కుమార్

Posted On 2026-06-24 19:13:12

Readmore >
Image 1

విద్యార్థుల భవిష్యత్తు కోసం కాంగ్రెస్ పోరాటం

Posted On 2026-06-24 19:11:52

Readmore >
Image 1

ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి, 8 మందికి గాయాలు

Posted On 2026-06-24 17:55:51

Readmore >