| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

ఔటర్ రింగ్ రోడ్డుపై వరుసగా ఆరు కార్లు ఢీ

ఔటర్ రింగ్ రోడ్డుపై వరుసగా ఆరు కార్లు ఢీ

డైలీ భారత్, హైదరాబాద్:ఔటర్ రింగ్ రోడ్డుపై వరుసగా ఆరు కార్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి. రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హిమాయత్ సాగర్ ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలో ఈ ఘటన జరిగింది. శంషాబాద్ నుంచి గచ్చిబౌలి వైపు వెళ్తుండగా ఎస్ క్రాస్ కారు డ్రైవర్ హిమాయత్ సాగర్ వద్ద సడన్‌గా బ్రేక్ వేశాడు. దీంతో వరుసగా ఆరు కార్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఔటర్ రింగ్ రోడ్డుపై రెండు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఈ ప్రమాదంలో ఆరు కార్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. కారులోని బెలూన్స్ ఓపెన్ కావడంతో ప్రమాదం తప్పింది. ఔటర్ పై ఏర్పడిన ట్రాఫిక్‌ను రాజేంద్రనగర్ లాండ్ ఆర్డర్, ట్రాఫిక్ పోలీసులు క్లియర్ చేశారు. ప్రమాదానికి గల కారణాలను పరిశీలిస్తున్నామని, కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.

Previous భారీ వర్షాలకు నష్టపోయిన రైతులను ఆదుకోవడంలో రాష్ట్ర సర్కార్ పూర్తిగా విఫలం : మాజీ మంత్రి హరీష్ రావు
Next అఖిల భారత అయ్యప్ప భక్తుల సంఘం అనంతపురం జిల్లా చైన్నై కొత్తపల్లె మండల శాఖ అధ్యక్షుడుగా బిల్లే వేణుగోపాల్
ADVERTISEMENT