| Daily భారత్
Logo




మద్యం మత్తులో జిల్లా కేంద్రంలో అర్ధరాత్రి కత్తిపోట్లు

News

Posted on 2025-10-05 12:59:18

Share: Share


మద్యం మత్తులో జిల్లా కేంద్రంలో అర్ధరాత్రి కత్తిపోట్లు

ఇరువురికి గాయాలు ఆసుపత్రికి తరలించిన పోలీసులు

డైలీ భారత్, నిజామాబాద్:జిల్లాకేంద్రంలో సమీప బంధువులైన ఇద్దరు యువకుల మధ్య మద్యం తాగిన అనంతరం మద్యం మత్తులో జరిగిన ఘర్షణలో ఒకరిపై ఒకరు పరస్పరం దాడులకు పాల్పడగా ఓ యువకుడికి కత్తిపోట్లు కాగా మరో యువకుడు గాయపడ్డాడు. నిజామాబాద్ రూరల్ ఎస్సై మహమ్మద్ ఆరిఫ్ తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. నగరం లోని చంద్రశేఖర్ కాలనీకి చెందిన ఆకాశ్, మాణిక్ అనే ఇద్దరు యువ కులు కలిసి శనివారం రాత్రి ఓ చోట మద్యం సేవించారు. అనంతరం వీరి మధ్య మాటా మాటా పెరిగి ఘర్షణ చోటు చేసుకున్నది. ఈ ఘర్ష ణలో ఆకాశ్ కు స్వల్పగాయాలయ్యాయి. ఇంటికి తిరిగి వచ్చిన ఆకాశ్ ముఖంపై గాయాలు చూసి అతడి తమ్ముడు, కుటుంబ సభ్యులు ఏం జరిగిందని ప్రశ్నించి, వారందరూ కలిసి దాడి చేసిన మాణిక్ ఇంటికి వెళ్లి అతడిని నిలదీశారు. ఆగ్రహంతో మళ్లీ ఇంట్లోంచి కత్తి తెచ్చి ఆకాశ్ తలపై దాడి చేశాడు. ఈ దాడిలో ఆకాశ్ తలపై గాయమైంది. దీంతో అక్కడే ఉన్న ఆకాశ్ తమ్ముడు అరుణ్ కూడా మాణిక్ పై దాడి చేశాడు. దీంతో మాణిక్ కు సైతం గాయమైంది. ఇరువురిని చికిత్స నిమిత్తం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇరుపక్షాల వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు.

Image 1

దివ్యాంగులకు జాలి కాదు... సమాన అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం : మంత్రి సీతక్క

Posted On 2026-06-28 07:18:46

Readmore >
Image 1

సమయస్ఫూర్తితో బాలికను రక్షించిన దంపతులకు సీపీ సజ్జనర్ సత్కారం

Posted On 2026-06-27 20:20:48

Readmore >
Image 1

ఘనంగా హిందూ సామ్రాజ్య దినోత్సవం

Posted On 2026-06-27 19:10:17

Readmore >
Image 1

ఆస్ట్రేలియా పర్యటన ముగించుకొని ఇండియాకు విచ్చేసిన సహ చట్టం రాష్ట్ర డైరెక్టర్ సలీం కు సన్మానం

Posted On 2026-06-27 19:06:37

Readmore >
Image 1

ఆర్‌జీయూకేటీ బాసర్ విద్యార్థినికి రూ.10,000 ఆర్థిక సహాయం అందజేసిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, SP రాజేష్ చంద్ర

Posted On 2026-06-27 19:05:50

Readmore >
Image 1

గోపా జిల్లా ఉపాధ్యక్షులుగా నాగరాజ్ గౌడ్

Posted On 2026-06-27 19:04:51

Readmore >
Image 1

పట్టుబడిన / సీజ్ చేసిన 687 కిలోల గంజాయిని దహనం

Posted On 2026-06-27 18:49:05

Readmore >
Image 1

ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన ప్రతి హామీని ప్రభుత్వం అమలు చేస్తుంది : రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్

Posted On 2026-06-27 10:56:55

Readmore >
Image 1

గంటలోనే ముగ్గురు మైనర్ బాలికల ఆచూకీ..

Posted On 2026-06-27 07:16:30

Readmore >
Image 1

పిల్లలకు తప్పనిసరిగా పోలియో టీకా వేయించాలి : మంత్రి దామోదర

Posted On 2026-06-27 07:11:39

Readmore >